కొవిడ్-19 టెస్టుల్లో ఇండియానే నెంబర్ 2
కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అమెరికా, బ్రెజిల్, ఇండియాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇండియాలో కరోనా పాజిటివిటీ రేటు కూడా ఎక్కువగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. టెస్టుల సంఖ్య పెంచడం ద్వారా రోగులను ట్రేస్ చేయవచ్చని.. వారికి ఐసోలేషన్‌కు పంపి మరణాల సంఖ్య తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగా కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి అమెరికా టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచింది. ఇప్పటి వరకు 4 కోట్ల 20 లక్షల మందికి అమెరికా […]
కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అమెరికా, బ్రెజిల్, ఇండియాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇండియాలో కరోనా పాజిటివిటీ రేటు కూడా ఎక్కువగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. టెస్టుల సంఖ్య పెంచడం ద్వారా రోగులను ట్రేస్ చేయవచ్చని.. వారికి ఐసోలేషన్‌కు పంపి మరణాల సంఖ్య తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కాగా కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి అమెరికా టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచింది. ఇప్పటి వరకు 4 కోట్ల 20 లక్షల మందికి అమెరికా కరోనా టెస్టులు నిర్వహించింది. కాగా, అమెరికా తర్వాత అత్యధిక పరీక్షలు జరిపింది ఇండియానే. మొదట్లో టెస్టులు ఎక్కువగా చేయకపోయినా.. వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో కరోనా టెస్టింగ్స్ పెంచుకుంటూ పోయింది.
ఇప్పటి వరకు ఇండియాలో 1 కోటి 20 లక్షల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించారు. ఈ విషయం స్వయంగా వైట్‌హౌస్ తెలిపింది. ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా అమెరికా కోవిడ్ పరీక్షలు నిర్వహించిందని.. ఆ తర్వాతి స్థానంలో ఇండియా ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెలీగ్ మెక్ ఎనానీ మీడియాకు వెల్లడించారు.
ఇండియాలో గత కొన్ని రోజులుగా నిత్యం 3 లక్షల శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3,30,228 శాంపిల్స్‌కు పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 1,30,72,718 కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.