Telugu Global
NEWS

క్యాంప్‌ ఆఫీసులో తీసేశారు... సచివాలయంలో మరిచారు !

ఏపీ సీఎం జగన్‌ తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఆ మధ్య కొన్ని మార్పులు జరిగాయి. సీఎం జగన్‌ వెనుకాల ఇన్నాళ్లు కొండచిలువ తోలులా ఉండే బ్యాక్‌గ్రౌండ్‌ ఉండేది. ఇది చూడడానికి ఎబ్బెట్టుగా ఉండేది. సీఎం కూర్చునే సీటు వెనుక పద్మం లాంటి ఆకారం కనిపిస్తుంది. ఆ పద్మం ఆకారం అంతా మొసలి చర్మం మీద ఉండే పొలుసుల్లాగా కనిపిస్తుంది. దీని వల్ల చాలా చెడ్డ వైబ్రేషన్స్‌ ఉంటాయని సమాచారం వెళ్లింది. ఇంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సచివాలయంలో […]

క్యాంప్‌ ఆఫీసులో తీసేశారు... సచివాలయంలో మరిచారు !
X

ఏపీ సీఎం జగన్‌ తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఆ మధ్య కొన్ని మార్పులు జరిగాయి. సీఎం జగన్‌ వెనుకాల ఇన్నాళ్లు కొండచిలువ తోలులా ఉండే బ్యాక్‌గ్రౌండ్‌ ఉండేది. ఇది చూడడానికి ఎబ్బెట్టుగా ఉండేది. సీఎం కూర్చునే సీటు వెనుక పద్మం లాంటి ఆకారం కనిపిస్తుంది. ఆ పద్మం ఆకారం అంతా మొసలి చర్మం మీద ఉండే పొలుసుల్లాగా కనిపిస్తుంది. దీని వల్ల చాలా చెడ్డ వైబ్రేషన్స్‌ ఉంటాయని సమాచారం వెళ్లింది.

ఇంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సచివాలయంలో సీఎం మీటింగ్‌ హాలులో ఈ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉండేది. చూడడానికి అట్రాక్టివ్‌గా లేని….ఉపయోగం లేని ఈ బ్యాక్ గ్రౌండ్‌ను సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకొచ్చారు. దీని వల్ల ఉపయోగం లేదు. ఈ మధ్య ప్రభుత్వానికి తలనొప్పులు వచ్చాయి. దీంతో కొంత మంది సూచన మేరకు ఈబ్యాక్‌ గ్రౌండ్‌ను తొలగించారు. ఏపీ ప్రభుత్వ ముద్రతో తెల్లటి బ్యాక్ గ్రౌండ్‌ను ఏర్పాటు చేశారు.

సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ బ్యాక్‌గ్రౌండ్‌ ను తీసేశారు. కానీ సచివాలయంలో కేబినెట్‌ మీటింగ్‌ జరిగే హాలు, సీఎం సమీక్షలు జరిపే హాలులో మాత్రం ఈ బ్యాక్‌ గ్రౌండ్‌ తీసివేయలేదు. ఇంకా అలాగే ఉంది. క్యాంపు కార్యాలయంలో తీసివేశారు. మరీ అక్కడ ఎందుకు తీసివేయలేదు అనే చర్చ నడుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వంలో ఏ కేబినెట్ మీటింగ్‌ విజువల్స్‌ బయటకు రావు. కేంద్ర మంత్రి వర్గ సమావేశం విజువల్స్‌, ఫొటోలు విడుదల చేయరు. కానీ ఏపీలో మాత్రం టీడీపీ హాయాంలో ప్రతి కేబినెట్‌ మీటింగ్‌ విజువల్స్‌ను మీడియాకు పంపేవారు. ప్రచారం కోసం పాకులాడే చంద్రబాబు చేసే జిమ్మిక్కులు అవి.

కానీ ఇప్పుడు కూడా అదేదో పెద్ద సంప్రదాయం అనేలా ఈ ప్రభుత్వంలో కూడా అధికారులు పాటిస్తున్నారు. ప్రతి కేబినెట్‌ సమావేశం విజువల్స్‌ ను బయటకు పంపిస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఇలా జరగదు. కానీ పాత టీడీపీ బాటలోనే ఇంకా ఇక్కడి అధికారులు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

First Published:  17 July 2020 3:49 AM IST
Next Story