Telugu Global
NEWS

ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు.... మాదిరెడ్డిపై వేటు

సర్వీస్‌ రూల్స్ ఉల్లంఘించిన అడిషనల్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్‌పై ప్రభుత్వం వేటు వేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆర్టీసీ ఎండి పదవి నుంచి తొలగించిన సమయంలో మాదిరెడ్డి ప్రతాప్ ప్రభుత్వంపై కొన్ని విమర్శలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అదికూడా మీడియా సమావేశంఏర్పాటు చేసి విమర్శలు చేశారు. ఈ అంశాన్ని సీఎస్ సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు సర్వీస్‌ రూల్స్‌కు విరుద్దమని గుర్తు చేశారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. ఎందుకు […]

ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు.... మాదిరెడ్డిపై వేటు
X

సర్వీస్‌ రూల్స్ ఉల్లంఘించిన అడిషనల్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్‌పై ప్రభుత్వం వేటు వేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

ఆర్టీసీ ఎండి పదవి నుంచి తొలగించిన సమయంలో మాదిరెడ్డి ప్రతాప్ ప్రభుత్వంపై కొన్ని విమర్శలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అదికూడా మీడియా సమావేశంఏర్పాటు చేసి విమర్శలు చేశారు. ఈ అంశాన్ని సీఎస్ సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు సర్వీస్‌ రూల్స్‌కు విరుద్దమని గుర్తు చేశారు.

వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మాదిరెడ్డి ప్రతాప్‌ ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆయనపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఆర్టీసీ ఎండీ పోస్టు నుంచి ఇటీవలే మాదిరెడ్డి ప్రతాప్‌ను ఏపీఎస్పీ బెటాలియన్‌ డీజీగా బదిలీ చేశారు. బదిలీ చేసిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన్ను ఏపీఎస్పీ బెటాలియన్ డీజీ పోస్టు నుంచి ప్రస్తుతం తప్పించారు. జీఏడీలో రిపోర్టు చేయాలని సీఎస్ ఆదేశించారు.

First Published:  16 July 2020 3:57 AM IST
Next Story