పట్టుబడిన డబ్బుతో నాకు సంబంధం లేదు " బాలినేని
తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఒక కారులో పట్టుబడిన రూ. 5.27 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఒంగోలు నుంచి తమిళనాడుకు గంజాయి సరఫరా అవుతోందన్న సమాచారంతో తమిళనాడులోని ఆరంబాక్కం పోలీసులు ఎలావూరు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అటుగా ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఒక కారు వచ్చింది. దాన్ని తనిఖీ చేయగా నాలుగు సంచుల్లో రూ. 5.27కోట్లు బయటపడింది. కారులో ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ […]
తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఒక కారులో పట్టుబడిన రూ. 5.27 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.
ఒంగోలు నుంచి తమిళనాడుకు గంజాయి సరఫరా అవుతోందన్న సమాచారంతో తమిళనాడులోని ఆరంబాక్కం పోలీసులు ఎలావూరు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అటుగా ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఒక కారు వచ్చింది. దాన్ని తనిఖీ చేయగా నాలుగు సంచుల్లో రూ. 5.27కోట్లు బయటపడింది. కారులో ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు ఒంగోలుకు చెందిన వారు.
డబ్బును ఐటీ శాఖకు అప్పగించారు. ముగ్గురు నిందితులను విచారిస్తున్నారు. పట్టుబడిన కారుపై బాలినేని శ్రీనివాస్ స్టిక్కర్ ఉండడంతో నగదు ఆయనదేనంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని మంత్రి ఖండించారు.
పట్టుబడిన నగదుతో గానీ, కారుతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కారుపై ఉన్న స్టిక్కర్ ఫొటో జిరాక్స్ అని వివరించారు. ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిజాలు వెలుగులోకి తేవాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోరారు.