ఈఎస్‌ఐ కుంభకోణంలో మరో అరెస్ట్....
ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తిరుపతి ఈఎస్‌ఐ అడ్మినిస్ట్రేషన్‌లో అసిస్టెంట్‌గా పనిచేసిన తోట జానకీరాంను ఏసీబీ అరెస్ట్ చేసింది. 2017-19 మధ్యలో జరిగిన ఈఎస్‌ఐ అవకతవకల్లో జానకీరాం పాత్ర ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. నాన్ ఆర్సీ డ్రగ్స్, సర్జికల్ కొనుగోలులో అక్రమాలకు జానకీరాం పాల్పడినట్టు ఏసీబీ విచారణలో తేలింది. జానకీరాంను అరెస్ట్ చేసిన ఏసీబీ అతడిని కోర్టు ముందు హాజరుపరచగా… 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పటి వరకు ఈఎస్‌ఐ స్కాంలో మొత్తం 11 మందిని […]
ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తిరుపతి ఈఎస్‌ఐ అడ్మినిస్ట్రేషన్‌లో అసిస్టెంట్‌గా పనిచేసిన తోట జానకీరాంను ఏసీబీ అరెస్ట్ చేసింది. 2017-19 మధ్యలో జరిగిన ఈఎస్‌ఐ అవకతవకల్లో జానకీరాం పాత్ర ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. నాన్ ఆర్సీ డ్రగ్స్, సర్జికల్ కొనుగోలులో అక్రమాలకు జానకీరాం పాల్పడినట్టు ఏసీబీ విచారణలో తేలింది.
జానకీరాంను అరెస్ట్ చేసిన ఏసీబీ అతడిని కోర్టు ముందు హాజరుపరచగా… 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పటి వరకు ఈఎస్‌ఐ స్కాంలో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. మరో ఆరుగురి కోసం అన్వేషిస్తున్నారు. పరారీలో ఉన్న వారిలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని సురేష్ కూడా ఉన్నారు. అతడి కోసం కొంతకాలంగా పోలీసులు గాలిస్తున్నారు.
ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా… హైకోర్టు తిరస్కరించింది. పితాని సురేష్‌పై స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయని… కేసు కీలక దశలో ఉన్నందున పితాని సురేష్‌కు ముందస్తుబెయిల్ సాధ్యం కాదని ఇటీవల హైకోర్టు స్పష్టం చేసింది.