ఒకేసారి 12 మాస్కులు ధరించిన హీరోయిన్
ఈ కరోనా కాలంలో నటీనటులంతా తమకు తోచిన విధంగా తమ అభిమానులకు సందేశాలు ఇస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని, తప్పకుండా మాస్క్ వేసుకోవాలని కోరుతున్నారు. అయితే ఇందులో కూడా కాస్త వెరైటీ చూపించేవాళ్లు ఉన్నారు. హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇదే రకం. మాస్క్ ధరించండి అనే సందేశాన్ని తనదైన స్టయిల్ లో అందిస్తోంది సోనాక్షి సిన్హా. ఒకేసారి 12 మాస్కులు ధరించి ఓ వీడియో పోస్ట్ చేసింది. 20 సెకెన్ల ఆ వీడియోలో రకరకాల మాస్కుల్ని చూపించింది. […]

ఈ కరోనా కాలంలో నటీనటులంతా తమకు తోచిన విధంగా తమ అభిమానులకు సందేశాలు ఇస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని, తప్పకుండా మాస్క్ వేసుకోవాలని కోరుతున్నారు. అయితే ఇందులో కూడా కాస్త వెరైటీ చూపించేవాళ్లు ఉన్నారు. హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇదే రకం.
మాస్క్ ధరించండి అనే సందేశాన్ని తనదైన స్టయిల్ లో అందిస్తోంది సోనాక్షి సిన్హా. ఒకేసారి 12 మాస్కులు ధరించి ఓ వీడియో పోస్ట్ చేసింది. 20 సెకెన్ల ఆ వీడియోలో రకరకాల మాస్కుల్ని చూపించింది. ఏ మోడలైనా సెలక్ట్ చేసుకోండి కానీ ధరించడం మాత్రం మరిచిపోకండంటూ ఓ సందేశాన్ని ఇచ్చింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో నెపొటిజం అంశం తెరపైకి రావడంతో బాలీవుడ్ లో చాలామంది అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. వాళ్లలో సోనాక్షి సిన్హా కూడా ఒకరు. అలా చాలామందితో విమర్శలు ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ, తాజా వీడియోతో ఓ మోస్తరుగా మద్దతు కూడగట్టుకోగలిగింది.