కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ... ఏపీ కేబినెట్ ఆమోదం
ఏపీ కేబినెట్ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీని నియమించింది. సీఎం జగన్ నేతృత్వంలో సమావేశమైన కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. మార్చి 31 నాటికి జిల్లాల ఏర్పాటు కు అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పార్లమెంట్ సరిహద్దుల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం జగన్ ఇప్పటికే చెప్పారు. కేబినెట్ సమావేశంలో జిల్లాల ఏర్పాటు పై మంత్రుల అభిప్రాయాన్ని […]
ఏపీ కేబినెట్ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీని నియమించింది. సీఎం జగన్ నేతృత్వంలో సమావేశమైన కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. మార్చి 31 నాటికి జిల్లాల ఏర్పాటు కు అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
పార్లమెంట్ సరిహద్దుల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం జగన్ ఇప్పటికే చెప్పారు. కేబినెట్ సమావేశంలో జిల్లాల ఏర్పాటు పై మంత్రుల అభిప్రాయాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు.
అరకు జిల్లా భౌగోళికంగా విస్తీర్ణంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. అరకు పార్లమెంట్ నియోజకవర్గం నాలుగు జిల్లాలకు విస్తరించి ఉందని సీఎం దృష్టికి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తీసుకెళ్లారు. దీంతో అరకు ను రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని సీఎం జగన్ సూచించారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు.