సత్యాన్ని వేధించవచ్చు... ఓడించలేరు
సచిన్ పైలట్‌పై వేటు వేసింది కాంగ్రెస్ పార్టీ. రాజస్థాన్‌లో తిరుగుబాటు చేసిన పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించారు. ఆయనకు మద్దతుగా ఉన్న మరో ఇద్దరు మంత్రులపైనా వేటు పడింది. రెండో రోజు నిర్వహించిన సీఎల్‌పీ భేటీకి సచిన్ పైలట్ రాకపోవడంతో కాంగ్రెస్ చర్యలు తీసుకుంది. కొత్త పీసీసీ చీఫ్‌గా గోవింద్ సింగ్‌ను కాంగ్రెస్ నియమించింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ సొంతబలం 107 మంది ఎమ్మెల్యేలు. సీఎల్‌పీ భేటీకి 102 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని […]
సచిన్ పైలట్‌పై వేటు వేసింది కాంగ్రెస్ పార్టీ. రాజస్థాన్‌లో తిరుగుబాటు చేసిన పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించారు. ఆయనకు మద్దతుగా ఉన్న మరో ఇద్దరు మంత్రులపైనా వేటు పడింది. రెండో రోజు నిర్వహించిన సీఎల్‌పీ భేటీకి సచిన్ పైలట్ రాకపోవడంతో కాంగ్రెస్ చర్యలు తీసుకుంది. కొత్త పీసీసీ చీఫ్‌గా గోవింద్ సింగ్‌ను కాంగ్రెస్ నియమించింది.
రాజస్థాన్‌లో కాంగ్రెస్ సొంతబలం 107 మంది ఎమ్మెల్యేలు. సీఎల్‌పీ భేటీకి 102 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని అశోక్ గెహ్లాట్ ప్రకటించుకున్నారు. గవర్నర్‌ను కలిసిన సీఎం… సచిన్ పైలట్‌తో పాటు మరో ఇద్దరు మంత్రులను తప్పించాలని గవర్నర్‌కు సిఫార్సు చేశారు. వెంటనే గవర్నర్ అందుకు ఆమోదం తెలిపారు.
సచిన్ పైలట్ వర్గం మాత్రం ఇప్పటికీ తమకు 30 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చెబుతోంది. తనను పదవుల నుంచి తొలగించడంపై ట్విట్టర్‌లో స్పందించిన సచిన్ పైలట్… సత్యాన్ని వేధించవచ్చు గానీ ఓడించలేరని ట్వీట్ చేశారు. తనపై వేటు వేసిన వెంటనే తన ట్విట్టర్ ప్రొఫైల్‌ను సచిన్ పైలట్ సవరించారు.