ఇద్దరు మంత్రుల పేర్లు దాదాపు ఖరారు
ఇటీవల మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులకు కొత్త వారి పేర్లు దాదాపు ఖరారు అయ్యాయి. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లను సీఎం జగన్ ఖరారు చేసినట్టు సమాచారం. రెండు మంత్రి పదవుల్లో ఒకటి శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజుకు కేటాయిస్తారని సమాచారం. ఈయన స్వతహాగా డాక్టర్. ఇటీవల కరోనా విషయంలో అప్పలరాజు స్థానికంగా తీసుకున్న చర్యలు సీఎంను ఆకర్షించాయి. కేబినెట్ లోకి […]
ఇటీవల మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులకు కొత్త వారి పేర్లు దాదాపు ఖరారు అయ్యాయి.
మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లను సీఎం జగన్ ఖరారు చేసినట్టు సమాచారం. రెండు మంత్రి పదవుల్లో ఒకటి శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజుకు కేటాయిస్తారని సమాచారం. ఈయన స్వతహాగా డాక్టర్. ఇటీవల కరోనా విషయంలో అప్పలరాజు స్థానికంగా తీసుకున్న చర్యలు సీఎంను ఆకర్షించాయి. కేబినెట్ లోకి తీసుకుంటే అప్పలరాజుకు వైద్య ఆరోగ్య శాఖ అప్పగించవచ్చు. మోపిదేవి మత్స్యకార సామాజికవర్గానికి చెందినవారు కాగా అప్పలరాజు కూడా అదే సామాజిక వర్గం.
పిల్లి సుభాష్ చంద్ర బోస్ తో ఖాళీ అయిన స్థానాన్ని శెట్టి బలిజ వర్గానికి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు ఇవ్వనున్నారు. పిల్లి సుభాష్ కూడా శెట్టి బలిజ సామాజిక వర్గం వారే.
ఇక ప్రస్తుతం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో పిల్లి సుభాష్ వల్ల ఖాళీ అయిన స్థానానికి 9నెలలు మాత్రమే గడువు ఉంది. అందువల్ల ఆ స్థానానికి ఎన్నిక జరగదు. మోపిదేవి వెంకట రమణ ఎమ్మెల్సీ స్థానాన్ని మర్రి రాజశేఖర్ కు ఇస్తున్నారు. గవర్నర్ కోటలో రెండు స్థానాలను కడప జిల్లా రాయచోటికి చెందిన జకియా సుల్తానా అనే మహిళకు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషిన్ రాజుకు కేటాయించబోతున్నారు సీఎం. మోషిన్ రాజు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు.