ఏపీ డిప్యూటీ సీఎం స్విమ్స్ వదిలేసి హైదరాబాద్‌కు జంప్
కరోనా నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. భారీగా పరీక్షలు, రోగులకు ట్రీట్‌మెంట్, బాధితులకు నాణ్యమైన ఆహారం ఇలా అనేక విషయాల్లో ఏపీ ప్రభుత్వం మన్ననలు పొందుతోంది. కానీ సొంత ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు మాత్రం జగన్ ప్రభుత్వం నమ్మకం కలిగించలేకపోయింది. కొద్దిరోజుల క్రితమే అంజాద్ బాషా కరోనా బారినపడ్డారు. దాంతో ఆయన శుక్రవారం తిరుపతిలోని రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు ప్రత్యేక గదిని కేటాయించారు. […]
కరోనా నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. భారీగా పరీక్షలు, రోగులకు ట్రీట్‌మెంట్, బాధితులకు నాణ్యమైన ఆహారం ఇలా అనేక విషయాల్లో ఏపీ ప్రభుత్వం మన్ననలు పొందుతోంది. కానీ సొంత ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు మాత్రం జగన్ ప్రభుత్వం నమ్మకం కలిగించలేకపోయింది.
కొద్దిరోజుల క్రితమే అంజాద్ బాషా కరోనా బారినపడ్డారు. దాంతో ఆయన శుక్రవారం తిరుపతిలోని రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు ప్రత్యేక గదిని కేటాయించారు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగా ఉందని స్విమ్స్ ఉన్నతాధికారి భూమా వెంగమ్మ ప్రకటించారు. అయితే ఆదివారం సాయంత్రం వారు స్విమ్స్‌ను వదిలిపెట్టి హైదరాబాద్‌లోని ఆస్పత్రికి వెళ్లినట్టు భూమా వెంగమ్మ వివరించారు.
ఇదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. తిరుపతి స్విమ్స్‌లో చేరి ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లడం ద్వారా అంజాద్ బాషా ప్రజలకు ఏం మేసేజ్ పంపారు అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సొంత రాష్ట్రంలో అందిస్తున్న కరోనా వైద్యంపై ఉప ముఖ్యమంత్రికే నమ్మకం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది జగన్ ప్రభుత్వానికే అవమానకరం అని వ్యాఖ్యానిస్తున్నారు.
టీఆర్‌ఎస్ నేతలు గాంధీ ఆస్పత్రిలో కాకుండా ప్రైవేట్ ఆస్పత్రిలో చేరితే ట్రోల్ చేసిన వైసీపీ వారు ఇప్పుడేం సమాధానం చెబుతారని విపక్షాలకు చెందిన నెటిజన్లు ఎత్తిపొడుస్తున్నారు. అంజాద్ బాషా హైదరాబాద్ వెళ్లిపోవడం ద్వారా ఏపీలో కరోనాకు అత్యుత్తమ వైద్యం అందించే ఆస్పత్రే లేదని తేల్చేశారని విమర్శలు వస్తున్నాయి.