Telugu Global
Cinema & Entertainment

వంశీ పైడిపల్లికి ఓకే చెప్పిన చరణ్

ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాల లిస్ట్ కన్ ఫర్మ్ అయింది. కానీ అదే ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న చరణ్ మాత్రం తన నెక్ట్స్ ప్రాజెక్టును ఎనౌన్స్ చేయలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ లిస్ట్ లో సందీప్ రెడ్డి వంగతో పాటు ఓ కొత్త దర్శకుడి పేరు కూడా వినిపించింది. అయితే అనూహ్యంగా ఓ సీనియర్ డైరక్టర్ కు చరణ్ ఛాన్స్ ఇచ్చినట్టు వార్తలు […]

వంశీ పైడిపల్లికి ఓకే చెప్పిన చరణ్
X

ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాల లిస్ట్ కన్ ఫర్మ్ అయింది. కానీ అదే ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న చరణ్ మాత్రం తన నెక్ట్స్ ప్రాజెక్టును ఎనౌన్స్ చేయలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పటికే ఈ లిస్ట్ లో సందీప్ రెడ్డి వంగతో పాటు ఓ కొత్త దర్శకుడి పేరు కూడా వినిపించింది. అయితే అనూహ్యంగా ఓ సీనియర్ డైరక్టర్ కు చరణ్ ఛాన్స్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అతడే వంశీ పైడిపల్లి.

మహర్షి సినిమా తర్వాత చాన్నాళ్లు ఖాళీగా ఉన్నాడు వంశీ. మహర్షి సినిమా రిలీజైన వెంటనే మహేష్ కోసం మరో కథ రాసే పనిలో పడ్డాడు. అయితే మహేష్ కు ఆ కథ నచ్చలేదు. అదే విషయాన్ని వంశీకి చెప్పేశాడు కూడా. దీంతో మరో హీరో వేటలో పడిన వంశీ పైడిపల్లి.. రామ్ చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ సంపాదించాడు.

అయితే మహేష్ కోసం రాసుకున్న కథతోనే వంశీ పైడిపల్లి, చరణ్ తో సినిమా తీస్తాడా లేక ఈ గ్యాప్ లో చరణ్ కోసం మరో కొత్త కథ రాశాడా అనేది డౌట్.

First Published:  12 July 2020 3:30 PM IST
Next Story