Telugu Global
National

3 రోజుల్లో లక్ష కేసులు... కరోనా కంట్రోల్‌ తప్పిందా?

దేశంలో కరోనా విజృంభిస్తోంది. మూడు రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 8 లక్షలు దాటింది. మహారాష్ట్రలో రెండు లక్షల 30 వేలు, తమిళనాడులో లక్షా 30 వేలు, ఢిల్లీలో లక్షా పది వేలకు పైగా కేసులు పాజిటివ్ గా‌ తేలాయి. తమిళనాడులో మొత్తం నమోదైన కేసుల్లో ఒక్క చెన్నైలోనే 58 శాతానికి పైగా నమోదు అయ్యాయి. ఆ తర్వాత మధురైలో గత 16 రోజులుగా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో […]

3 రోజుల్లో లక్ష కేసులు... కరోనా కంట్రోల్‌ తప్పిందా?
X

దేశంలో కరోనా విజృంభిస్తోంది. మూడు రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 8 లక్షలు దాటింది.

మహారాష్ట్రలో రెండు లక్షల 30 వేలు, తమిళనాడులో లక్షా 30 వేలు, ఢిల్లీలో లక్షా పది వేలకు పైగా కేసులు పాజిటివ్ గా‌ తేలాయి.

తమిళనాడులో మొత్తం నమోదైన కేసుల్లో ఒక్క చెన్నైలోనే 58 శాతానికి పైగా నమోదు అయ్యాయి. ఆ తర్వాత మధురైలో గత 16 రోజులుగా కేసులు పెరుగుతున్నాయి.

దేశంలో 90 శాతం కేసులు 8 రాష్ట్రాల్లోనే బయటపడుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్నాటక, తెలంగాణ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో ఎక్కువ శాతం కేసులు నమోదు అవుతున్నాయి. కేవలం 49 జిల్లాల నుంచి ఎక్కువ యాక్టివ్‌ కేసులు బయటపడుతున్నాయని కేంద్రం తెలిపింది.

ఉత్తరప్రదేశ్‌లో రాత్రి పది నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. పెరుగుతున్న కేసులతో మహారాష్ట్రలోని పుణే, పింప్రి, చించ్‌వాడ్‌లో జూలై 13 నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించారు. కేవలం నిత్యావసరాలకు మాత్రమే ఇక్కడ అనుమతి ఇస్తారు. పుణేలో ఒక్కరోజే 1803 కేసులు బయటపడ్డాయి. దీంతో వైరస్‌ లింక్‌ తెగేందుకు లాక్‌డౌన్‌ మార్గమని అధికారులు నిర్ణయించారు. పదిరోజుల పాటు లాక్‌డౌన్‌ విధించారు.

కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సీజ్‌ చేశారు. సీఎం ఆఫీస్‌లోని సిబ్బందికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. యడ్యూరప్ప కార్యాలయాన్ని శానిటైజ్‌ చేయడం ఇది రెండోసారి.

మాండ్యా ఎంపీ సుమలత ఇటీవలే యడ్యూరప్పను కలిశారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ వచ్చింది, దీంతో సీఎం కార్యాలయంలోని సిబ్బందికి కూడా వైరస్‌ సోకడంతో యడ్యూరప్ప క్వారంటైన్‌లోకి వెళ్లారు.

First Published:  11 July 2020 2:20 AM IST
Next Story