మొన్న చంద్రబాబు... ఈసారి పవన్ కల్యాణ్
మొన్నటికి మొన్న చంద్రబాబుని టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీశాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడీ దర్శకుడు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశాడు. పవర్ స్టార్ అనే టైటిల్ తో సినిమా తీయబోతున్నట్టు కొన్ని రోజుల కిందట ప్రకటించిన ఈ డైరక్టర్, వెంటనే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు. పవర్ స్టార్ ఫస్ట్ లుక్ లో రెండు పదాల మధ్య గాజు గ్లాస్ ను ఉంచాడు వర్మ. పవన్ ఎన్నికల గుర్తు అదే. […]
మొన్నటికి మొన్న చంద్రబాబుని టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీశాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడీ దర్శకుడు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశాడు. పవర్ స్టార్ అనే టైటిల్ తో సినిమా తీయబోతున్నట్టు కొన్ని రోజుల కిందట ప్రకటించిన ఈ డైరక్టర్, వెంటనే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు.
పవర్ స్టార్ ఫస్ట్ లుక్ లో రెండు పదాల మధ్య గాజు గ్లాస్ ను ఉంచాడు వర్మ. పవన్ ఎన్నికల గుర్తు అదే. ఇక ఈ సినిమాకు ఎన్నికల ఫలితాల తర్వాత కథగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం పాలిటిక్స్ కే పరిమితం కాకుండా.. ఇందులో పవన్ సినిమాల్ని కూడా మిక్స్ చేస్తున్నాడు.
ఫస్ట్ లుక్ తో పాటు వర్మ విడుదల చేసిన స్టిల్స్ లో పవన్ తో పాటు చిరంజీవి, త్రివిక్రమ్ పాత్రధారులు కూడా కనిపిస్తున్నారు. అంతేకాదు.. చీర కట్టుకున్న రష్యన్ అమ్మాయి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోందంటున్నాడు వర్మ.
మొత్తమ్మీద పవర్ స్టార్ సినిమాతో వర్మ ఈసారి మరింత వివాదాన్ని రాజేసేలా ఉన్నాడు.
Putting the tea glass in the logo of POWER STAR is because the hero drinks tea often and it’s not for any political reasons ..In SHIVA logo I used Cycle chain because hero often hits with it ..THAT’S IT! pic.twitter.com/513oHQbPtv
— Ram Gopal Varma (@RGVzoomin) July 10, 2020
Kindly do no believe in media speculations with regard to resemblances in the film POWER STAR ..it is just destiny that some of them look like some of them coincidentally pic.twitter.com/BxJhLFUejT
— Ram Gopal Varma (@RGVzoomin) July 9, 2020
Lovely Brothers in POWER STAR pic.twitter.com/T6oCBqcBLf
— Ram Gopal Varma (@RGVzoomin) July 9, 2020
A RUSSIAN woman wrapped in an INDIAN saree with the ARGENTANIAN legend CHE GUEVERA hung on the wall while reading the FRENCH origin book of PAPILLON …..The lead character in the film is truly a GLOBAL POWERSTAR??? pic.twitter.com/7hQkDHgl3k
— Ram Gopal Varma (@RGVzoomin) July 9, 2020