కరోనా వచ్చిందని బండ్లకు ఎలా తెలిసిందంటే...
చాలామందికి ఇప్పుడు కరోనా లక్షణాలు బయటకు తెలియడం లేదు. కానీ వాళ్లకు కరోనా ఉంటోంది. పరీక్షలు చేస్తే తప్ప తెలియడం లేదు. బండ్ల గణేష్ కు కూడా కరోనా లక్షణాలేం లేవు. మరి ఆయనకు కరోనా సోకినట్టు ఎలా తెలిసింది. దీనికి బండ్ల గణేష్ వివరణ ఇచ్చాడు. బండ్ల గణేష్ కు ఇప్పుడు 46 ఏళ్లు. వయసురీత్యా వచ్చిన మార్పుల వల్ల ఆయన జుట్టు ఊడిపోతోంది. దీంతో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవాలని అనుకున్నాడు. ఓ వైద్యుడ్ని […]
చాలామందికి ఇప్పుడు కరోనా లక్షణాలు బయటకు తెలియడం లేదు. కానీ వాళ్లకు కరోనా ఉంటోంది. పరీక్షలు చేస్తే తప్ప తెలియడం లేదు. బండ్ల గణేష్ కు కూడా కరోనా లక్షణాలేం లేవు. మరి ఆయనకు కరోనా సోకినట్టు ఎలా తెలిసింది. దీనికి బండ్ల గణేష్ వివరణ ఇచ్చాడు.
బండ్ల గణేష్ కు ఇప్పుడు 46 ఏళ్లు. వయసురీత్యా వచ్చిన మార్పుల వల్ల ఆయన జుట్టు ఊడిపోతోంది. దీంతో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవాలని అనుకున్నాడు. ఓ వైద్యుడ్ని సంప్రదించాడు. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అంగీకరించిన ఆ వైద్యుడు.. అన్ని రకాల బ్లడ్ టెస్టులతో పాటు కరోనా పరీక్ష కూడా చేయించుకోమన్నాడట. రూల్ ప్రకారం బండ్ల కూడా శాంపిల్ ఇచ్చాడట.
అప్పటివరకు తనకు కరోనా సోకదనే ధైర్యంతోనే ఉన్నాడట బండ్ల. అయితే శాంపిల్ ఇచ్చిన 2 రోజులకు ఓ రోజు ల్యాబ్ నుంచి ఫోన్ వచ్చిందట. మీకు కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయండి. అందరికీ దూరంగా ఉండమని చెప్పారట. దీంతో ఒక్కసారి నమ్మలేకపోయాడట బండ్ల. కానీ అదే వాస్తవం.
ఫోన్ వచ్చే సమయానికి బయట ఉన్న బండ్ల.. ఇంటికి వెళ్లి ఎవ్వర్నీ టచ్ చేయకుండా తనకుతాను వేరే గదిలోకి వెళ్లిపోయాడట. కొంతమంది స్నేహితులు వచ్చి ఐసొలేషన్ కు కావాల్సిన ఏర్పాట్లు చేశారట. అలా తనకు కరోనా సోకడం, దాన్నుంచి బయటపడడం జరిగాయంటున్నాడు బండ్ల గణేశ్.