కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందనే వాదనను కొట్టిపారేయలేం " డబ్ల్యూహెచ్‌వో
కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని గత వారం 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థలకు లేఖ రాసిన విషయం తెలిసిందే. అప్పటికి ఆ విషయాన్ని కొట్టిపారేసినా, తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. గాలిద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే వాదనను కొట్టిపారేయలేమని.. కానీ పూర్తి సాక్ష్యాలు సేకరించిన తర్వాత ప్రపంచానికి చెప్పాలని అనుకున్నట్లు డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్ లీడ్ చీఫ్ మారియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు. గాలి […]
కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని గత వారం 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థలకు లేఖ రాసిన విషయం తెలిసిందే. అప్పటికి ఆ విషయాన్ని కొట్టిపారేసినా, తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. గాలిద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే వాదనను కొట్టిపారేయలేమని.. కానీ పూర్తి సాక్ష్యాలు సేకరించిన తర్వాత ప్రపంచానికి చెప్పాలని అనుకున్నట్లు డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్ లీడ్ చీఫ్ మారియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు.
గాలి ద్వారా తుంపర్లు కొద్ది దూరం ప్రయాణించి నేలపై పడిపోతాయని ఇన్నాళ్లు భావించాం, అయితే ఈ వైరస్ కణాలు కొద్ది కాలం గాలిలోనే ఉంటున్నాయని, తద్వారా దాన్ని పీల్చిన వ్యక్తి కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నట్లు గుర్తించాం. అయితే దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని ఆమె అన్నారు.
కొవిడ్-19 వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తోందనేందుకు సాక్ష్యం ఉందని, అయితే ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని కెర్ఖోవ్ తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న పద్ధతుల్లో అది కూడా ఒక్కటై ఉండొచ్చని ఆమె పేర్కొన్నారు.
గాలి ద్వారా కొవిడ్ వ్యాప్తికి సంబంధించిన ఆధారాలను సేకరించి విశ్లేషించడం ద్వారా దానిపై ప్రపంచదేశాలకు మరింత స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. అయితే జనీవాకు చెందిన ఒక ఏజెన్సీ ప్రపంచలోని 32 దేశాలకు చెందిన 239 మంది పరిశోధకులు చేసిన ఒక అధ్యయనానికి చెందిన లేఖను ప్రచురించింది. దానికే డబ్ల్యూహెచ్‌వో ఈ వివరణ ఇచ్చింది.
అయితే ఈ లేఖను ప్రచురించి డబ్ల్యూహెచ్‌వోపై దాడి చేయడం మా ఉద్దేశం కాదని… కానీ దీనిపై విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చాలా సార్లు డబ్ల్యూహెచ్‌వోతో ఈ విషయంపై చర్చించాం… కానీ వాళ్లు మా సాక్ష్యాలను వినడానికి నిరాకరిస్తూ వచ్చారు… అయితే ప్రపంచానికి ఈ విషయాలు తెలియాలనే బహిరంగపరిచాము అని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకి చెందిన కెమిస్ట్ జోస్ జిమినెజ్ తెలిపారు.