ఆ రెస్టారెంట్లో... మాస్కులు వడ్డిస్తారు!
మాస్క్….ఈ పదం ఇప్పుడు చాలా పాపులర్. దీని ప్రాధాన్యత మరింతగా పెరగాల్సి ఉంది. ఒంటిమీద దుస్తులు ధరించినంత సహజంగా మాస్క్ కూడా ధరించాల్సినంత స్థాయిలో దీని అవసరం ఉంది. అందుకే మధురైలోని ఒక రెస్టారెంట్ వినూత్నంగా తనదైన శైలిలో మాస్క్ ప్రాధాన్యతను తెలిపే ప్రయత్నం చేసింది. రుచికరమైన పరోటాలను మాస్క్ ల రూపంలో తయారుచేసింది. యధాలాపంగా చూస్తే… నిజంగా మాస్కేనేమో అనేంత సహజంగా వాటిని తయారుచేయటం విశేషం. పిండి కాలి… ఏర్పడిన మచ్చలు డిజైన్ లా కనబడుతూ […]
మాస్క్….ఈ పదం ఇప్పుడు చాలా పాపులర్. దీని ప్రాధాన్యత మరింతగా పెరగాల్సి ఉంది. ఒంటిమీద దుస్తులు ధరించినంత సహజంగా మాస్క్ కూడా ధరించాల్సినంత స్థాయిలో దీని అవసరం ఉంది. అందుకే మధురైలోని ఒక రెస్టారెంట్ వినూత్నంగా తనదైన శైలిలో మాస్క్ ప్రాధాన్యతను తెలిపే ప్రయత్నం చేసింది.
రుచికరమైన పరోటాలను మాస్క్ ల రూపంలో తయారుచేసింది. యధాలాపంగా చూస్తే… నిజంగా మాస్కేనేమో అనేంత సహజంగా వాటిని తయారుచేయటం విశేషం. పిండి కాలి… ఏర్పడిన మచ్చలు డిజైన్ లా కనబడుతూ మాస్క్ పరోటాలు చూడచక్కగా ఉన్నాయి. దీని ధర ఒక్కోటీ యాభై రూపాయలు. మాస్క్ ధరించాలనే అవగాహన పెంచాలనే ఉద్దేశ్యంతోనే వీటిని తయారుచేసినట్టుగా రెస్టారెంట్ యజమాని వెల్లడించాడు. వీరి మెనూలో కరోనా రవ్వదోశ, కరోనా బోండా కూడా ఉన్నాయి.
కొత్తదనం ఎక్కడ కనిపించినా పట్టం కట్టే సోషల్ మీడియాలో మాస్క్ పరోటాలు సంచలనంగా మారాయి. మీమ్స్, ట్వీట్లు, కామెంట్లు, లైకులు… ప్రపంచవ్యాప్తంగా వెల్లువలా వస్తున్నాయి.