'జగనన్న తోడు...' ఇవే అర్హతలు
ఏసీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ సామాన్యుల అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇప్పటికే పలు రంగాల వారికి చేయూతనిచ్చే ఎన్నో పథకాలు ప్రారంభించిన వైఎస్ జగన్, తాజాగా చిరు వ్యాపారుల కోసం ‘జగనన్న తోడు..’ అనే పథకాన్ని ప్రకటించారు. లాక్‌డౌన్ కాలంలో కుంటుపడిన అనేక మంది వ్యాపారులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది. ఇప్పటికే ఈ పథకం కింద లబ్దిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఒక కార్యాచరణను ప్రారంభించింది. ఈ […]
ఏసీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ సామాన్యుల అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇప్పటికే పలు రంగాల వారికి చేయూతనిచ్చే ఎన్నో పథకాలు ప్రారంభించిన వైఎస్ జగన్, తాజాగా చిరు వ్యాపారుల కోసం ‘జగనన్న తోడు..’ అనే పథకాన్ని ప్రకటించారు.
లాక్‌డౌన్ కాలంలో కుంటుపడిన అనేక మంది వ్యాపారులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది. ఇప్పటికే ఈ పథకం కింద లబ్దిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఒక కార్యాచరణను ప్రారంభించింది. ఈ నెల 16న ఈ సర్వే ముగిసిన అనంతరం, 23న అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రకటించనుంది.
రాష్ట్రంలోని అన్ని రకాల చిరు వ్యాపారాలు చేసే వాళ్లు ఈ పథకానికి అర్హులు. తోపుడు బండ్లు, ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు చేసేవాళ్లతో పాటు కొయ్యబొమ్మలు, హస్తకళలపై ఆధారపడేవారందరికీ ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందించనుంది. ఒక్కొక్క లబ్ధిదారుడికి రూ. 10 వేల చొప్పున అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి ఈ పథకం వర్తించనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పథకానికి కావల్సిన అర్హతలు ఇలా ఉన్నాయి.
- దరఖాస్తు దారులు 18 ఏళ్లు నిండిన వాళ్లై ఉండాలి.
- పట్టణాల్లో అయితే నెలకు రూ.12 వేల కంటే తక్కువ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేల కంటే తక్కువ సంపాదన ఉండాలి.
- చిరు వ్యాపారం చేసే వారికి 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు. దీనిలో 3 ఎకరాల కంటే ఎక్కవ మాగాణి ఉండకూడదు.
- 5 చదరపు అడుగుల వైశాల్యం కంటే తక్కువ స్థలంలో వ్యాపారాలు చేస్తుండాలి.