Telugu Global
National

ఏపీలో కరోనా పరీక్షల కోసం సంజీవని బస్సులు

పదిలక్షలకు పైగా కరోనా పరీక్షలతో దూసుకెళుతున్న ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇప్పటివరకూ 10 లక్షల 94 వేలకు పైగా టెస్టులు నిర్వహించారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు గ్రామాల్లో పరీక్షల కోసం సంజీవని పేరిట బస్సులు తీసుకొస్తున్నారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక బస్సులను తయారు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంజీవని బస్సులను పరీక్షల కోసం డిజైన్‌ చేశారు. […]

ఏపీలో కరోనా పరీక్షల కోసం సంజీవని బస్సులు
X

పదిలక్షలకు పైగా కరోనా పరీక్షలతో దూసుకెళుతున్న ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇప్పటివరకూ 10 లక్షల 94 వేలకు పైగా టెస్టులు నిర్వహించారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు గ్రామాల్లో పరీక్షల కోసం సంజీవని పేరిట బస్సులు తీసుకొస్తున్నారు.

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక బస్సులను తయారు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంజీవని బస్సులను పరీక్షల కోసం డిజైన్‌ చేశారు. ఆర్టీసీకి చెందిన 52 బస్సులను కరోనా మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ గా మార్చేశారు.

ఇప్పటికే 30 బస్సులు రెడీ అయ్యాయి. వివిధ జిల్లాలకు వీటిని పంపించారు. మరో 22 బస్సులు తయారు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు జిల్లాలకు ఓ కరోనా సెంటర్‌ను పెట్టిన ప్రభుత్వం…ఇప్పుడు ప్రతి జిల్లాకు 4 కరోనా టెస్ట్‌ బస్సులను పంపుతోంది. ఈ సంజీవని బస్సుల ద్వారా కరోనా అనుమానితులకు ఫ్రీగా టెస్టులు నిర్వహించనున్నారు.

మొత్తానికి కరోనా కట్టడికి ఏపీ తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే పది లక్షలకు పైగా టెస్టులతో దేశం దృష్టిని ఆకర్షించిన సీఎం జగన్‌….ఇప్పుడు సంజీవని బస్సులతో కూడా మరోసారి అందరి దృష్టిలో పడ్డారు.

First Published:  9 July 2020 2:26 PM IST
Next Story