ఆరోపణలకు చేతల్లో జగన్ సమాధానం
ఎల్‌జీ పాలిమర్స్ దుర్ఘటనలో కంపెనీ సీఈవో జియోంగ్ తో పాటు 12 మందిని పోలీసులు ఒకేసారి అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. పెద్దపెద్ద కంపెనీల్లో దుర్ఘటనలు జరిగినా చర్యలుండవన్న అభిప్రాయాన్ని ఏపీ ప్రభుత్వం పటాపంచలు చేసింది. 12 మందిని అరెస్ట్ చేయడంతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపైనా వేటు వేసింది. దుర్ఘటన జరిగిన వెంటనే విశాఖ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని… ఎయిర్‌పోర్టులోనే కంపెనీ ప్రతినిధులు నాడు కలిశారు. దాంతో తెలుగుదేశం పార్టీ […]
ఎల్‌జీ పాలిమర్స్ దుర్ఘటనలో కంపెనీ సీఈవో జియోంగ్ తో పాటు 12 మందిని పోలీసులు ఒకేసారి అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
పెద్దపెద్ద కంపెనీల్లో దుర్ఘటనలు జరిగినా చర్యలుండవన్న అభిప్రాయాన్ని ఏపీ ప్రభుత్వం పటాపంచలు చేసింది.
12 మందిని అరెస్ట్ చేయడంతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపైనా వేటు వేసింది.
దుర్ఘటన జరిగిన వెంటనే విశాఖ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని… ఎయిర్‌పోర్టులోనే కంపెనీ ప్రతినిధులు నాడు కలిశారు. దాంతో తెలుగుదేశం పార్టీ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శల దాడి చేసింది.
కంపెనీతో డీల్ మాట్లాడుకున్నారని… నిందితులను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని… ఇలా రకరకాలుగా ఆరోపణలు చేశారు. కానీ నిపుణుల కమిటీ రిపోర్టు వచ్చిన మరుసటి రోజే కంపెనీ సీఈవో తో పాటు 12 మందిని అరెస్ట్ చేయడం ద్వారా విపక్షం చేసిన ఆరోపణల్లో పసలేదని ప్రభుత్వం నిరూపించినట్టు అయింది.