ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్
ఎట్టకేలకు తన అభిమానులకు గుడ్ న్యూస్ మోసుకొచ్చాడు ప్రభాస్. తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. 10వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రాబోతోంది. కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే కాదు.. సినిమా టైటిల్ ను కూడా అదే టైమ్ లో ఎనౌన్స్ చేయబోతున్నారు. ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ పై దాదాపు 2 నెలలుగా చర్చ సాగుతోంది. గతంలో జాన్ అనే టైటిల్ […]

ఎట్టకేలకు తన అభిమానులకు గుడ్ న్యూస్ మోసుకొచ్చాడు ప్రభాస్. తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. 10వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రాబోతోంది. కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే కాదు.. సినిమా టైటిల్ ను కూడా అదే టైమ్ లో ఎనౌన్స్ చేయబోతున్నారు.
ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ పై దాదాపు 2 నెలలుగా చర్చ సాగుతోంది. గతంలో జాన్ అనే టైటిల్ అనుకుంటే, దిల్ రాజు ఆ టైటిల్ తో ఏకంగా సినిమా చేసి రిలీజ్ చేశాడు. దీంతో ఆ టైటిల్ స్థానంలో రాథేశ్యామ్ అనే టైటిల్ అనుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారం నిజమా కాదా అనే విషయం 10వ తేదీన తేలిపోతుంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాథాకృష్ణ కుమార్ దర్శకత్వంలో దాదాపు ఏడాది కిందటే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే సాహో సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా కథలో మార్పులు చేర్పులు చేశారు. దీంతో షూట్ లేట్ అయింది. ఆ తర్వాత కరోనా వచ్చి పడింది. ఇలా పడుతూలేస్తూ సాగుతున్న ఈ సినిమాను ఏడాది చివరినాటికి పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
The announcement you all have been waiting for! Title & first look of #Prabhas20 will be out on 10.7.2020 at 10 AM?#Prabhas @hegdepooja @director_radhaa @UVKrishnamRaju garu @itsBhushanKumar #Vamshi #Pramod @PraseedhaU @UV_Creations @TSeries pic.twitter.com/64e4maW9us
— UV Creations (@UV_Creations) July 8, 2020