నాలో.. నాతో.. వైఎస్ఆర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించి, పేదలు, రైతులు, విద్యార్థులు, వృద్ధులు, నిరుద్యోగుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. ఆ మహానేత ఆడుగుజాడల్లోనే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుస్తున్నారు. వైఎస్ఆర్ గురించి ఆయన సన్నిహితులు, స్నేహితులు ఎంతో మంది ఎన్నో మంచి విషయాలు, బయటకు తెలియని విషయాలు చెబుతుంటారు. కానీ 37 ఏళ్ల పాటు ఆయన జీవిత సహచరిగా […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించి, పేదలు, రైతులు, విద్యార్థులు, వృద్ధులు, నిరుద్యోగుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. ఆ మహానేత ఆడుగుజాడల్లోనే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుస్తున్నారు.
వైఎస్ఆర్ గురించి ఆయన సన్నిహితులు, స్నేహితులు ఎంతో మంది ఎన్నో మంచి విషయాలు, బయటకు తెలియని విషయాలు చెబుతుంటారు. కానీ 37 ఏళ్ల పాటు ఆయన జీవిత సహచరిగా ఉన్న విజయమ్మ ఆయన గురించి చెబితే… తెలుసుకోవాలని ఎవరికి ఉండదు.
వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితాన్ని దగ్గర నుంచి చూసిన ఆయన సతీమణి విజయమ్మ రాసిన పుస్తకమే ‘నాలో.. నాతో.. వైఎస్ఆర్’. వైఎస్ 71వ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఇడుపులపాయలో ఆ పుస్తకాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. 2009 సెప్టెంబర్ 2న ఆ మహానేత ఘోర దుర్ఘటనలో మరణించిన నాటి నుంచి ప్రజలు ఆయన గురించి అనుకున్న విషయాలు, చెప్పిన విషయాలు, తెలుసుకున్న విషయాలు అన్నీ క్రోఢీకరించి ఈ పుస్తకాన్ని తీసుకొని వచ్చినట్లు ఆమె తెలిపారు.
రాజకీయనాయకుడిగా ప్రజల్లో ఉంటూనే వైఎస్ఆర్ కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా… నిజ జీవితంలో వైఎస్సార్ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో… ఉన్నది ఉన్నట్టుగా విజయమ్మ వివరించారు. వైఎస్ఆర్ వేసిన ప్రతీ అడుగు వెనుక ఉన్న ఆలోచనను, అనుభవాల నుంచి వైఎస్ తెలుసుకున్న పాఠాలను ఈ పుస్తకంలో చాలా చక్కగా విశ్లేషించారు.
వైఎస్ తన జీవితాంతం పంచిన మంచితనమనే సంపద కేవలం తన పిల్లలు, మనవలకే కాకుండా.. అందరికీ తెలియజేయాలని, ప్రతీ ఇంటికి చేరాలనే ఆకాంక్షతోనే ఈ పుస్తకాన్ని తీసుకొని వచ్చినట్లు విజయమ్మ స్పష్టం చేశారు. ఈ పుస్తకాన్ని వైఎస్‌ఆర్‌ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్న, చూసుకుంటున్న తెలుగు ప్రజలందరికీ అంకితం ఇస్తున్నట్లు విజయమ్మ తెలిపారు.