Telugu Global
National

కరోనా పేషంట్ల సేవలో రోబోటిక్ ట్రాలీ!

కోవిడ్ 19 పేషంట్లకు చికిత్స, సేవలు చేస్తూ వైద్య సిబ్బంది సైతం ఆ మహమ్మారికి గురవుతున్నారు. వైద్యం, ఇతర సేవలు అందించేవారు తరచుగా పేషంట్ల వద్దకు వెళ్లకుండా ఉండే మార్గాలు ఇప్పుడు చాలా అవసరం. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ముందడుగు వేసింది. కోవిడ్ 19 పేషంట్లకు ఆహారం, మంచినీళ్లు, మందులు లాంటివి అందించేందుకు ఓ రోబోటిక్ ట్రాలీని తయారుచేశారు. మనిషి వెళ్లవలసిన అవసరం లేకుండా ఈ రోబో ట్రాలీ పేషంట్ల వద్దకు వెళుతుంది. దానిపైన […]

కరోనా పేషంట్ల సేవలో రోబోటిక్ ట్రాలీ!
X

కోవిడ్ 19 పేషంట్లకు చికిత్స, సేవలు చేస్తూ వైద్య సిబ్బంది సైతం ఆ మహమ్మారికి గురవుతున్నారు. వైద్యం, ఇతర సేవలు అందించేవారు తరచుగా పేషంట్ల వద్దకు వెళ్లకుండా ఉండే మార్గాలు ఇప్పుడు చాలా అవసరం. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ముందడుగు వేసింది.

కోవిడ్ 19 పేషంట్లకు ఆహారం, మంచినీళ్లు, మందులు లాంటివి అందించేందుకు ఓ రోబోటిక్ ట్రాలీని తయారుచేశారు. మనిషి వెళ్లవలసిన అవసరం లేకుండా ఈ రోబో ట్రాలీ పేషంట్ల వద్దకు వెళుతుంది. దానిపైన ఉన్న వస్తువులను పేషంట్లు తీసుకుంటారు. ఈ ట్రాలీ పేరు గొల్లార్. ముంబయిలోని వర్లీలో ఉన్న పోడార్ హాస్పటల్ లో దీనిని వాడుతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్లర్లో రోబో ట్రాలీ పేషంట్ల వద్దకు వెళుతున్న వీడియోని పోస్ట్ చేసింది.

వైరస్ పైన చేస్తున్న పోరాటంలో వైద్య సిబ్బంది దానిబారిన పడకుండా తీసుకుంటున్న చర్యల్లో ఇది చాలా ముఖ్యమైనదని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.

అయితే ఇంతకుముందే చండీఘర్ లో ఇలాంటి రోబోటిక్ ట్రాలీని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సంస్ధ ఆవిష్కరించింది. అక్కడి వైద్యులు దానిని రూపొందించారు.

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సంస్థలో ఉన్న ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ సహకారంతో తాము రోబో ట్రాలీని వాడుతున్నామని, 25వేల రూపాయల్లో దీనిని తయారుచేసుకోవచ్చని అక్కడి వైద్యులు అంటున్నారు. వైద్య సిబ్బంది మరింత సురక్షితంగా సేవలు అందించేందుకు దోహదం చేసే ఈ మార్గాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించవచ్చు.

First Published:  8 July 2020 7:04 AM IST
Next Story