హాస్పిటల్ లో చేరిన సీనియర్ నటి
సీనియర్ నటి జయంతి ఉన్నఫలంగా కుప్పకూలిపోయారు. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆమెను హుటాహుటిన బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పై శ్వాస తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. జయంతి హాస్పిటల్ లో చేరిన వెంటనే ఆమెకు కరోనా సోకి ఉంటుందంటూ చాలామంది అనుమానించారు. కానీ జయంతికి కరోనా సోకలేదని వైద్యులు నిర్థారించారు. పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ వచ్చినట్టు ప్రకటించారు. కేవలం వయసురీత్యా వచ్చిన […]
సీనియర్ నటి జయంతి ఉన్నఫలంగా కుప్పకూలిపోయారు. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆమెను హుటాహుటిన బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పై శ్వాస తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.
జయంతి హాస్పిటల్ లో చేరిన వెంటనే ఆమెకు కరోనా సోకి ఉంటుందంటూ చాలామంది అనుమానించారు. కానీ జయంతికి కరోనా సోకలేదని వైద్యులు నిర్థారించారు. పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ వచ్చినట్టు ప్రకటించారు. కేవలం వయసురీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలతోనే ఆమె ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 500కు పైగా సినిమాల్లో నటించారు జయంతి. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, రజనీకాంత్ లాంటి స్టార్స్ సరసన నటించారు.