Telugu Global
NEWS

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. ఎల్లుండి వైఎస్ జయంతి సందర్భంగా 30లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని భావించారు. కానీ కోర్టుల్లో ఉన్న కేసులు కొలిక్కి రాకపోవడంతో పంపిణీని వాయిదా వేశారు. తొలుత ఉగాది రోజే ఇవ్వాలనుకున్నారు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు కోర్టు కేసుల వల్ల మరోసారి వాయిదా పడింది. ఆగస్ట్ 15న ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఇళ్ల పట్టాల […]

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా
X

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. ఎల్లుండి వైఎస్ జయంతి సందర్భంగా 30లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని భావించారు. కానీ కోర్టుల్లో ఉన్న కేసులు కొలిక్కి రాకపోవడంతో పంపిణీని వాయిదా వేశారు.

తొలుత ఉగాది రోజే ఇవ్వాలనుకున్నారు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు కోర్టు కేసుల వల్ల మరోసారి వాయిదా పడింది. ఆగస్ట్ 15న ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉందంటున్నారు.

ఇప్పటికే ఇళ్ల పట్టాల కోసం 43వేల ఎకరాలను సిద్ధం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీపై కొందరు కోర్టుల్లో కేసులు వేశారు. అమరావతిలో వెనుకబడిన వర్గాల వారికి 50వేల ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని టీడీపీ వర్గీయులు కోర్టులో సవాల్ చేశారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం పట్టాల పంపిణీని వాయిదా వేసింది.

First Published:  6 July 2020 8:26 AM IST
Next Story