గెలిపించిన పార్టీపై విమర్శలు చేయడం రఘురామకృష్ణంరాజు వ్యక్తిత్వం... న్యాయవ్యవస్థపై ప్రజా చర్చ జరగాలి...
న్యాయవ్యవస్థ తీరుపై దేశవ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. దేశంలో మూడు వ్యవస్థలున్నాయని… ఒక వ్యవస్థ పనిలోకి మరో వ్యవస్థ జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. ప్రతి వ్యవస్థకు రాజ్యాంగం హద్దులు, హక్కులు, అధికారాలు ఇచ్చిందన్నారు. ఒక వ్యవస్థ మరో వ్యవస్థలో జోక్యం చేసుకోవడంపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థల పనితీరుపై ఒక పౌరుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక స్పీకర్‌గా తన అభిప్రాయం చెబుతున్నానన్నారు. ఒక […]

న్యాయవ్యవస్థ తీరుపై దేశవ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. దేశంలో మూడు వ్యవస్థలున్నాయని… ఒక వ్యవస్థ పనిలోకి మరో వ్యవస్థ జోక్యం చేసుకోవడం సరికాదన్నారు.
ప్రతి వ్యవస్థకు రాజ్యాంగం హద్దులు, హక్కులు, అధికారాలు ఇచ్చిందన్నారు. ఒక వ్యవస్థ మరో వ్యవస్థలో జోక్యం చేసుకోవడంపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థల పనితీరుపై ఒక పౌరుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక స్పీకర్‌గా తన అభిప్రాయం చెబుతున్నానన్నారు.
ఒక వ్యవస్థ మరొక వ్యవస్థలోకి జోక్యం చేసుకోవడం వల్ల… ఒక వ్యక్తి కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఆగిపోవడానికి కారణమైన వ్యక్తి ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు.
ఎంపీ రఘురామకృష్ణంరాజు వైఖరిని కూడా స్పీకర్ తప్పుపట్టారు. పార్టీలో ఇబ్బందులుంటే అంతర్గతంగా చర్చించుకోవాలి గానీ… బహిరంగంగా విమర్శలకు దిగడం సరికాదన్నారు. రఘురామకృష్ణంరాజు ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేస్తున్నారన్నది స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
ఒక పార్టీ టికెట్‌పై గెలిచి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. ఇలా చేయడం రఘురామకృష్ణంరాజు వ్యక్తిత్వానికే సంబంధించిన అంశం అని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. పార్టీలో ఉండడం ఇష్టంలేకపోతే బయటకు వెళ్లిపోవాలి సూచించారు.