Telugu Global
Cinema & Entertainment

మరోసారి ఖాకీ చొక్కాలోకి శర్వానంద్

కథ కొత్తగా ఉంటే పెద్దగా ఆలోచించడు శర్వానంద్. డైరక్టర్ ఎవరైనా అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఇప్పటివరకు అదే చేశాడు. ఇకపై కూడా అదే చేస్తాడు. ఈ క్రమంలో మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు శర్వా. శ్రీరామ్ అనే కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు. శర్వానంద్ కు పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చెప్పాడు శ్రీరామ్. ఇప్పటివరకు తెలుగుతెరపై కొన్ని వందల పోలీస్ పాత్రలు వచ్చాయి. అయినప్పటికీ శ్రీరామ్ చెప్పిన క్యారెక్టరైజేషన్ […]

మరోసారి ఖాకీ చొక్కాలోకి శర్వానంద్
X

కథ కొత్తగా ఉంటే పెద్దగా ఆలోచించడు శర్వానంద్. డైరక్టర్ ఎవరైనా అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఇప్పటివరకు అదే చేశాడు. ఇకపై కూడా అదే చేస్తాడు. ఈ క్రమంలో మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు శర్వా. శ్రీరామ్ అనే కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు.

శర్వానంద్ కు పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చెప్పాడు శ్రీరామ్. ఇప్పటివరకు తెలుగుతెరపై కొన్ని వందల పోలీస్ పాత్రలు వచ్చాయి. అయినప్పటికీ శ్రీరామ్ చెప్పిన క్యారెక్టరైజేషన్ శర్వానంద్ కు నచ్చిందంటే.. కథలో ఏదో కొత్తదనం ఉన్నట్టే. సరిగ్గా ఇక్కడే ఈ ప్రాజెక్టు అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

నిజానికి శర్వానంద్ కు పోలీస్ పాత్ర కొత్తేంకాదు. ఇంతకుముందు రాథ అనే సినిమాలో అతడు పోలీస్ గానే కనిపించాడు. కాకపోతే అది ఫన్నీ పోలీస్. ఈసారి మాత్రం సీరియస్ పోలీసాఫీసర్ గా శర్వానంద్ కనిపించబోతున్నాడు.

సినిమా అయితే ఓకే అయింది. ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది అప్పుడే చెప్పలేం. ఎందుకంటే శర్వా చేతిలో ఇప్పటికిప్పుడు 3 సినిమాలున్నాయి మరి.

First Published:  5 July 2020 4:48 AM IST
Next Story