Telugu Global
NEWS

విశాఖలో డీజీపీ పర్యటన... ఆఫీసుల కోసం ఆరా

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విశాఖలో పర్యటించారు. శనివారం బిజీబిజీగా గడిపారు. విశాఖకు పరిపాలన రాజధాని తరలిపోవడం ఖాయం అవడంతో పోలీసు శాఖకు సంబంధించిన కార్యాలయాల కోసం డీజీపీ ఆరా తీశారు. రుషికొండ ఐటీ హిల్స్‌-2లో పలు భవనాలను పరిశీలించారు. న్యూనెట్‌ సంస్థకు చెందిన భారీ భవంతిని పరిశీలించిన డీజీపీ… అక్కడి సదుపాయాలపై ఆరా తీశారు. ఈ భవంతిపై మరో అంతస్తు నిర్మించుకునే అవకాశం ఉందా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొట్లకొండలో గ్రేహౌండ్స్ విభాగం ఉన్న […]

విశాఖలో డీజీపీ పర్యటన... ఆఫీసుల కోసం ఆరా
X

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విశాఖలో పర్యటించారు. శనివారం బిజీబిజీగా గడిపారు. విశాఖకు పరిపాలన రాజధాని తరలిపోవడం ఖాయం అవడంతో పోలీసు శాఖకు సంబంధించిన కార్యాలయాల కోసం డీజీపీ ఆరా తీశారు.

రుషికొండ ఐటీ హిల్స్‌-2లో పలు భవనాలను పరిశీలించారు. న్యూనెట్‌ సంస్థకు చెందిన భారీ భవంతిని పరిశీలించిన డీజీపీ… అక్కడి సదుపాయాలపై ఆరా తీశారు. ఈ భవంతిపై మరో అంతస్తు నిర్మించుకునే అవకాశం ఉందా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తొట్లకొండలో గ్రేహౌండ్స్ విభాగం ఉన్న ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. జగన్నాథపురం వెళ్లి ప్రభుత్వం కేటాయించిన భూములను పరిశీలించారు. సింహపురి లేఅవుట్ వెనుక ఉన్న అటవీ భూములను పరిశీలించారు. అటవీ అధికారులు డీజీపీని కలిసి భూములకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అక్కడున్న అనుకూల, ప్రతికూల అంశాలపై చర్చించారు.

ఒకవైపు అమరావతి ఉద్యమం 200 రోజు అంటూ విపక్షం కార్యక్రమాలు నిర్వహించిన రోజే డీజీపీ విశాఖ వెళ్లి… కొత్త రాజధానిలో పోలీసు శాఖకు అవసరమైన భవంతులపై ఆరాతీశారు.

First Published:  5 July 2020 3:44 AM IST
Next Story