రామ్ గోపాల్ వర్మపై కేసు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు పడింది. ప్రస్తుతం ఈయన మర్డర్ అనే సినిమా తీస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు, మారుతిరావు ఆత్మహత్యపై తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించి ఆర్జీవీపై కేసు నమోదైంది. ఫాదర్స్ డే సందర్భంగా ఈ సినిమాను ఆర్భాటంగా ప్రకటించాడు వర్మ. ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, ఆ టైమ్ లో ప్రణయ్, మారుతి, అమృత పదాలు వచ్చేలా కొన్ని డైలాగ్ […]
దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు పడింది. ప్రస్తుతం ఈయన మర్డర్ అనే సినిమా తీస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు, మారుతిరావు ఆత్మహత్యపై తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించి ఆర్జీవీపై కేసు నమోదైంది.
ఫాదర్స్ డే సందర్భంగా ఈ సినిమాను ఆర్భాటంగా ప్రకటించాడు వర్మ. ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, ఆ టైమ్ లో ప్రణయ్, మారుతి, అమృత పదాలు వచ్చేలా కొన్ని డైలాగ్ లు వాడాడు. దీనిపై ప్రణయ్ తండ్రి అభ్యంతరం వ్యక్తంచేశాడు.
వర్మ చేస్తున్న మర్డర్ సినిమా షూటింగ్ ను నిలిపివేయాలని.. తమ పేర్లు వాడకుండా ఆదేశించాలని కోర్టును కోరాడు ప్రణయ్ తండ్రి. దీనిపై స్పందించిన కోర్టు.. వర్మపై కేసు నమోదు చేయాల్సిందిగా మిర్యాలగూడ పోలీసుల్ని ఆదేశించింది. ఆ వెంటనే వర్మపై కేసు నమోదలైంది.
అయితే దీనిపై వర్మ కూడా అంతే ఘాటుగా స్పందించాడు. ఈ కేసును తన లాయర్లు చూసుకుంటారంటూ ప్రకటించిన వర్మ.. సమాజంలో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా తను సినిమా తీస్తున్నానని, ఎవ్వర్నీ కించపరడం లేదని తెలిపాడు. ఈ విషయంలో తన క్రియేటివిటీని ఎవ్వరూ అడ్డుకోలేరని, తన హక్కుల పరిరక్షణ కోసం తను కూడా కోర్టుకు వెళ్తానని స్పష్టంచేశాడు.