రఘురామకృష్ణంరాజు పదవికే ఎసరు... రేపు ఢిల్లీకి ఎంపీల బృందం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది. పార్టీని చికాకు పెట్టి వేటు వేయించుకుని … మరో పార్టీలోకి వెళ్లాలన్న ఉద్దేశంతోనే రఘురామకృష్ణంరాజు ఇలా వ్యవహరిస్తున్నారన్న నిర్ధారణకు వచ్చిన వైసీపీ… అందుకు విరుగుడు మంత్రం వేయబోతోంది. రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలిని మౌనంగా పరిశీలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి… తనతోనే రఘురామకృష్ణంరాజు ఆటలు ఆడుతున్నారన్న అభిప్రాయానికి వచ్చినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వంపై సదుద్దేశంతోనే విమర్శలు చేసి ఉంటే… షోకాజ్ నోటీసులో వాటికి సానుకూలంగా వివరణ […]
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది. పార్టీని చికాకు పెట్టి వేటు వేయించుకుని … మరో పార్టీలోకి వెళ్లాలన్న ఉద్దేశంతోనే రఘురామకృష్ణంరాజు ఇలా వ్యవహరిస్తున్నారన్న నిర్ధారణకు వచ్చిన వైసీపీ… అందుకు విరుగుడు మంత్రం వేయబోతోంది.
రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలిని మౌనంగా పరిశీలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి… తనతోనే రఘురామకృష్ణంరాజు ఆటలు ఆడుతున్నారన్న అభిప్రాయానికి వచ్చినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఒకవేళ ప్రభుత్వంపై సదుద్దేశంతోనే విమర్శలు చేసి ఉంటే… షోకాజ్ నోటీసులో వాటికి సానుకూలంగా వివరణ ఇవ్వాల్సిందిపోయి… స్పీకర్‌ను కలవడం, ఈసీని కలిసి అసలు వైసీపీలో క్రమశిక్షణ సంఘం ఉందా అని ఆరా తీయడం, వైసీపీ పేరును వాడుకోవడాన్ని తప్పుపట్టడం వంటి చర్యలను బట్టి రఘురామకృష్ణంరాజు కావాలనే రెచ్చగొడుతున్నారన్న నిర్ధారణకు వైసీపీ వచ్చింది.
పార్టీ నుంచి బహిష్కరిస్తే రఘురామకృష్ణంరాజు కోరుకున్నదే చేసినట్టు అవుతుందని నిర్ధారణకు వచ్చిన వైసీపీ…. అలా కాకుండా ఆయన ఎంపీ సభ్యత్వాన్నే రద్దు చేయించేందుకు ముందుకెళ్తోంది.
ఇందుకోసం శుక్రవారం వైసీపీ ఎంపీల బృందం ఢిల్లీ వెళ్తోంది. వైసీపీ ఎంపీల బృందానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్న వైసీపీ ఎంపీలు… అక్కడ స్పీకర్‌ను కలిసి రఘురామకృష్ణంరాజుపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్నారు. ఎంపీల బృందం తన వెంట న్యాయనిపుణులను కూడా తీసుకెళ్తోంది.
పార్టీని, పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించేలా, చులకన చేసేలా రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు, చర్యలకు సంబంధించి ఆధారాలను సమర్పించనున్నారు. అనర్హత పిటిషన్ దాఖలు చేస్తే బీజేపీ కూడా రఘురామకృష్ణంరాజుకు అండగా ఉండే పరిస్థితి లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.