ఈసారి నిఖిల్ ఫెయిల్
థియేట్రికల్ బిజినెస్ లో నిఖిల్ కంటూ ఓ మార్కెట్ ఉంది. అతడి సినిమా ఎంతకు కొంటె ఎంత రెవెన్యూ వస్తుందనే లెక్కలు ఉన్నాయి. కానీ బుల్లితెరకు వచ్చేసరికి మాత్రం నిఖిల్ ను గెస్ చేయలేకపోతున్నాయి టీవీ ఛానెళ్లు. అతడు నటించిన ఏ సినిమాను టీవీ ప్రేక్షకులు ఆదరిస్తారో అర్థంకావడం లేదు. తాజాగా అలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది జీ తెలుగు. నిఖిల్ తాజా హిట్ అర్జున్ సురవరం. థియేటర్లలో హిట్టయిన ఈ సినిమా, స్మాల్ స్క్రీన్ పై కూడా […]
థియేట్రికల్ బిజినెస్ లో నిఖిల్ కంటూ ఓ మార్కెట్ ఉంది. అతడి సినిమా ఎంతకు కొంటె ఎంత రెవెన్యూ వస్తుందనే లెక్కలు ఉన్నాయి. కానీ బుల్లితెరకు వచ్చేసరికి మాత్రం నిఖిల్ ను గెస్ చేయలేకపోతున్నాయి టీవీ ఛానెళ్లు. అతడు నటించిన ఏ సినిమాను టీవీ ప్రేక్షకులు ఆదరిస్తారో అర్థంకావడం లేదు. తాజాగా అలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది జీ తెలుగు.
నిఖిల్ తాజా హిట్ అర్జున్ సురవరం. థియేటర్లలో హిట్టయిన ఈ సినిమా, స్మాల్ స్క్రీన్ పై కూడా క్లిక్ అవుతుందని భారీ మొత్తం పెట్టి శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది జీ తెలుగు. ఫుల్ గా ప్రచారం కూడా చేసింది. పనిలోపనిగా ఖాళీగా ఉన్న నిఖిల్ ను కూడా రంగంలోకి దించింది. అలా భారీ ప్రమోషన్ తో జీ తెలుగులో ప్రసారమైన ఈ సినిమా తుస్సుమనిపించింది.
అవును.. టీఆర్పీల్లో అర్జున్ సురవరం సినిమా తేలిపోయింది. ఈ సినిమా కంటే ఆల్రెడీ టెలికాస్ట్ అయిన మహర్షి, వినయవిథేయరామ, అశ్వద్థామ లాంటి సినిమాలు మంచి రేటింగ్స్ తెచ్చుకున్నాయి. దీంతో సదరు ఛానెల్ తలపట్టుకుంది. బాధాకరమైన విషయం ఏంటంటే.. టాప్-5 రేటింగ్స్ లో కూడా ఈ సినిమాకు స్థానం దక్కకపోవడం.
నిఖిల్ అప్ కమింగ్ సినిమాలపై ఈ ప్రభావం కచ్చితంగా పడుతుంది. అతడి సినిమాల శాటిలైట్ మార్కెట్ ని ప్రభావితం చేసే అంశం ఇది.