బిల్లుకు గవర్నర్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లో ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దాంతో ఉద్యోగుల జీతాలచెల్లింపుకు లైన్ క్లియర్ అయింది. ఇటీవల జరిగిన సమావేశాల్లో మండలిలో తనకున్న మెజారిటీ ఆధారంగా ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందకుండా టీడీపీ అడ్డుకోవడంతో ఒకటో తేదీన జీతాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. మండలి ఆమోదించినా, ఆమోదించకపోయినా 14 రోజుల తర్వాత బిల్లును గవర్నర్‌కు పంపే వెసులుబాటు ఉంటుంది. ఈ 14 రోజుల గడువు బుధవారం అర్థరాత్రిలో ముగిసింది. దాంతో గురువారం బిల్లును ప్రభుత్వం […]
ఆంధ్రప్రదేశ్‌లో ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దాంతో ఉద్యోగుల జీతాలచెల్లింపుకు లైన్ క్లియర్ అయింది. ఇటీవల జరిగిన సమావేశాల్లో మండలిలో తనకున్న మెజారిటీ ఆధారంగా ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందకుండా టీడీపీ అడ్డుకోవడంతో ఒకటో తేదీన జీతాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది.
మండలి ఆమోదించినా, ఆమోదించకపోయినా 14 రోజుల తర్వాత బిల్లును గవర్నర్‌కు పంపే వెసులుబాటు ఉంటుంది. ఈ 14 రోజుల గడువు బుధవారం అర్థరాత్రిలో ముగిసింది. దాంతో గురువారం బిల్లును ప్రభుత్వం గవర్నర్‌కు పంపారు.
బిల్లును పరిశీలించిన గవర్నర్ దానికి ఆమోద ముద్ర వేశారు. బిల్లుకు ఆమోదం తెలిపేందుకు గవర్నర్ రెండుమూడు రోజులు సమయం తీసుకుంటారని భావించారు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ వెంటనే బిల్లును ఆమోదించారు. శనివారం నాటికి ఆమోదం పొందుతుందని ప్రభుత్వం భావించగా… గవర్నర్ వేగంగా స్పందించడంతో ముందే ఆమోదం పొందింది.
అటు టీడీపీ తీరుపై ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడ్డారు. ” టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవడంతోనే మాకు జీతాలు రాలేదు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మా ఉద్యోగుల ఉసురు టీడీపీ ఎమ్మెల్సీలకు తగులుతుంది. మాజీ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కౌన్సిల్ లో ఉండి కూడా ఉద్యోగులకు మేలు జరలేదు.. అశోక్ బాబు ఉద్యోగులకు నష్టం జరుగుతుందని తెలిసి కూడా ద్రవ్యవినిమయ బిల్లును అడ్డుకున్నారు” అని ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు విమర్శించారు.