మెక్సికోలో దారుణం.. కాల్పుల్లో 24 మంది మృతి
మెక్సికోలో దారుణం చోటు చేసుకుంది. దేశంలోని ఇరపాటో నగరంలో నిర్వహిస్తున్న ఒక అనధికార మాదక ద్రవ్యాల పునరావాస కేంద్రంలోకి చొరబడిన అగంతకులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో 24 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్న ప్రతీ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకొని దుండగులు కాల్పులు జరిపారని, గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమై, […]

మెక్సికోలో దారుణం చోటు చేసుకుంది. దేశంలోని ఇరపాటో నగరంలో నిర్వహిస్తున్న ఒక అనధికార మాదక ద్రవ్యాల పునరావాస కేంద్రంలోకి చొరబడిన అగంతకులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో 24 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్న ప్రతీ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకొని దుండగులు కాల్పులు జరిపారని, గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమై, బుల్లెట్ షెల్స్ పడి భయానకంగా మారినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
అయితే ఈ దుశ్చర్య వెనుక మాదక ద్రవ్యాల ముఠాలు ఉండొచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. అధికారులు మాత్రం ఇంకా పూర్తి వివరాలు తెలియదని చెబుతున్నారు.
