ఆమెకు లక్ష... ఈమెకు 38వేలు
మొన్నటికిమొన్న హీరోయిన్ కార్తికకు దాదాపు లక్ష రూపాయలు కరెంట్ బిల్లు వచ్చింది. దీనిపై ఆమె సోషల్ మీడియాలో ఆగ్రహం కూడా వ్యక్తంచేసింది. కరెంట్ బిల్లులకు సంబంధించి ఏదో కుంభకోణం జరుగుతుందనే అనుమానాన్ని కూడా వ్యక్తంచేసింది. ఇప్పుడీ లిస్ట్ లోకి తాప్సి కూడా చేరిపోయింది. తనకు కూడా 38వేల రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని చెబుతూ,, స్క్రీన్ షాట్స్ పెట్టింది తాప్సి. నిజానికి స్టార్స్ కు 38వేల కరెంట్ బిల్లు రావడమనేది ఉన్నంతలో సాధారణమైన విషయమే. అయితే ఇక్కడ […]
మొన్నటికిమొన్న హీరోయిన్ కార్తికకు దాదాపు లక్ష రూపాయలు కరెంట్ బిల్లు వచ్చింది. దీనిపై ఆమె సోషల్ మీడియాలో ఆగ్రహం కూడా వ్యక్తంచేసింది. కరెంట్ బిల్లులకు సంబంధించి ఏదో కుంభకోణం జరుగుతుందనే అనుమానాన్ని కూడా వ్యక్తంచేసింది. ఇప్పుడీ లిస్ట్ లోకి తాప్సి కూడా చేరిపోయింది.
తనకు కూడా 38వేల రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని చెబుతూ,, స్క్రీన్ షాట్స్ పెట్టింది తాప్సి. నిజానికి స్టార్స్ కు 38వేల కరెంట్ బిల్లు రావడమనేది ఉన్నంతలో సాధారణమైన విషయమే. అయితే ఇక్కడ తాప్సి వ్యవహారం వేరు. ముంబయిలోని ఏ ఫ్లాట్ కు సంబంధించి కరెంట్ బిల్లు వచ్చిందో, ఆ ఫ్లాట్ ను తాప్సి వాడడం లేదట. జస్ట్ నెలకు ఒకసారి ఫ్లాట్ లోకి వెళ్లి శుభ్రం చేసి మళ్లీ తాళాలు వేసుకొని తన సొంతింటికి వచ్చేస్తుందట. అలాంటి ఫ్లాట్ కు 38వేల రూపాయల కరెంట్ బిల్లు రావడంపై తాప్సి ఆగ్రహం వ్యక్తంచేసింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ కరెంట్ బిల్లుల వివాదం జోరుగా సాగుతోంది. కార్తీక, తాప్సి బాటలో చాలామంది టెక్నీషియన్లు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తమకొచ్చిన భారీ కరెంట్ బిల్లుల్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు. తాప్సి, కార్తీకకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు.
అటు నేరుగా కాకపోయినా పరోక్షంగా ఈ వ్యవహారంపై స్పందించింది మహారాష్ట్ర సర్కార్. ముంబయిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు అధికంగా కరెంట్ బిల్లులు వచ్చిన విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనికి సంబంధించి అదానీ విద్యుత్ సంస్థతో చర్చిస్తామని ప్రకటించింది.