మోడీ హయాంలోనే భారీగా పెరిగిన చైనా దిగుమతులు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మేకిన్ ఇండియా అంటూ నినాదం ఇస్తున్న మోడీ ప్రభుత్వం… చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మేకిన్ ఇండియా అంటూ నినాదం ఇస్తున్న మోడీ ప్రభుత్వమే… చైనా నుంచి అధికంగా కొనుగోళ్లు చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన డేటా గ్రాఫ్‌ను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. యూపీఏ హయాంలో చైనా దిగుమతులు 12 శాతం నుంచి 14 శాతం కంటే తక్కువగానే ఉండగా… మోడీ […]
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మేకిన్ ఇండియా అంటూ నినాదం ఇస్తున్న మోడీ ప్రభుత్వం… చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
మేకిన్ ఇండియా అంటూ నినాదం ఇస్తున్న మోడీ ప్రభుత్వమే… చైనా నుంచి అధికంగా కొనుగోళ్లు చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన డేటా గ్రాఫ్‌ను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
యూపీఏ హయాంలో చైనా దిగుమతులు 12 శాతం నుంచి 14 శాతం కంటే తక్కువగానే ఉండగా… మోడీ వచ్చిన తర్వాత ప్రతి ఏటా భారీగా చైనా దిగుమతులు పెరుగుతున్నాయని రాహుల్ వివరించారు. మోడీ వచ్చిన తర్వాత అమాంతం ప్రతిఏటా చైనా నుంచి దిగుమతుల శాతం పెరుగుతూ ఉండడాన్ని రాహుల్ ప్రశ్నించారు.
ఇటీవల చైనా సైన్యం భారత భూభాగాన్ని ఆక్రమించిందని… ఈ విషయం ఉపగ్రహచాయా చిత్రాల ద్వారా కూడా స్పష్టమవుతోందని.. మరి భారత భూభాగం నుంచి చైనా సైన్యాన్ని ఎప్పుడు, ఎలా తరిమికొడతారో నరేంద్రమోడీ దేశప్రజలకు సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.