Telugu Global
CRIME

బొట్టు పెట్టుకోవడానికి నిరాకరించిన భార్య... భర్తకు విడాకులు మంజూరు చేసిన హైకోర్టు

హిందూ సాంప్రదాయం ప్రకారం తన భార్య బొట్టు పెట్టుకోవడానికి, గాజులు ధరించడానికి నిరాకరించిందని.. కాబట్టి ఆమెతో విడాకులు మంజూరు చేయాలని పిటిషన్ వేసిన భర్తకు గౌహతీ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. విడాకులు నిరాకరిస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి భర్త పిటిషన్‌లో పేర్కొన్న విషయాల ఆధారంగా చీఫ్ జస్టీస్ అజయ్ లాంబా, జస్టీస్ సౌమిత్ర సైకియాల బెంచ్ విడాకులు మంజూరు చేసింది. అసోంకి చెందిన జంటకు 2012 ఫిబ్రవరి 12న వివాహం అయ్యింది. […]

బొట్టు పెట్టుకోవడానికి నిరాకరించిన భార్య... భర్తకు విడాకులు మంజూరు చేసిన హైకోర్టు
X

హిందూ సాంప్రదాయం ప్రకారం తన భార్య బొట్టు పెట్టుకోవడానికి, గాజులు ధరించడానికి నిరాకరించిందని.. కాబట్టి ఆమెతో విడాకులు మంజూరు చేయాలని పిటిషన్ వేసిన భర్తకు గౌహతీ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.

విడాకులు నిరాకరిస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి భర్త పిటిషన్‌లో పేర్కొన్న విషయాల ఆధారంగా చీఫ్ జస్టీస్ అజయ్ లాంబా, జస్టీస్ సౌమిత్ర సైకియాల బెంచ్ విడాకులు మంజూరు చేసింది.

అసోంకి చెందిన జంటకు 2012 ఫిబ్రవరి 12న వివాహం అయ్యింది. పెళ్లి జరిగిన నాటి నుంచి ఇరువురి మధ్య సఖ్యత ఉండేది కాదు. ప్రతీ నిత్యం పోట్లాడుకుంటూ ఉండేవాళ్లు. కుటుంబ సభ్యులతో కలసి ఉండలేనని భార్య తేల్చి చెప్పింది. భర్త ఒప్పుకోక పోవడంతో 2013 జూన్ 30 నుంచి విడివిడిగా ఉంటున్నారు. ఆ తర్వాత భార్య తన భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. ఆ కుటుంబం తనను వేధిస్తున్నారని ఆమె కేసు పెట్టింది. ఆ తర్వాత అతను ఫ్యామిలీ కోర్టులో కేసు పెట్టాడు. తన భార్య వేధింపులకు గురిచేస్తోంది తనకు విడాకులు ఇవ్వమని కోరాడు. కానీ ఫ్యామిలీ కోర్టు అతని పిటిషన్ కొట్టేసింది.

దీంతో ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ అతను హైకోర్టులో కేసు వేశాడు. కేసుపై పూర్తి విచారణ చేపట్టిన హైకోర్టు.. ఫ్యామిలీ కోర్టు చేసిన తప్పిదాన్ని ఎత్తి చూపింది. భర్త తన తల్లిదండ్రులకు చేస్తున్న సహాయాన్ని భార్య తీవ్రంగా వ్యతిరేకించిందని, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రకారం.. భర్తను సహాయం చేయకుండా అడ్డుకోవడం హింస కిందకే వస్తుందని తేల్చి చెప్పింది.

భర్త తన తల్లిదండ్రులకు సహాయం చేయడాన్ని అడ్డుకోవడమే కాకుండా, భారతీయ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకొని గాజులు, బొట్టు పెట్టుకోవడానికి నిరాకరించడం అంటే పెళ్లికి గౌరవం ఇవ్వకపోవడమేనని బెంచ్ అభిప్రాయపడింది.

భర్తతో వివాహాన్ని భార్య నిరాకరించినట్లు ఈ చర్యలు తెలియజేస్తున్నాయి కాబట్టి, వెంటనే వీరిద్దరికీ విడాకులు మంజూరు చేస్తున్నామని… అదే సమయంలో ఫ్యామిలీ కోర్టు తీర్పును కొట్టేస్తున్నామని గౌహతీ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జూన్ 19న ఈ తీర్పు వెలువడగా, తాజాగా విషయం వెలుగులోనికి వచ్చింది.

First Published:  1 July 2020 1:10 AM IST
Next Story