Telugu Global
NEWS

ప్రతి మండలానికి 108, 104 వాహనాలు...

ప్రతి మండలంలోనూ ఒక 108, 104 వాహనాన్ని సిద్ధం చేస్తున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. చంద్రబాబు హయాంలో అంబులెన్స్‌లకు చిన్నపాటి మరమ్మతులు కూడా చేయించింది లేదన్నారు. చంద్రబాబు హయాంలో సగానికి పైగా అంబులెన్స్‌లు మూలనపడ్డాయన్నారు. ప్రజల ప్రాణాల పట్ల కనీస స్పృహను చంద్రబాబు ప్రదర్శించలేకపోయారన్నారు. 412 కొత్త 108 వాహనాలు, 656 కొత్త 104 వాహనాలను రేపు ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో 25 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 20నిమిషాల్లో, […]

ప్రతి మండలానికి 108, 104 వాహనాలు...
X

ప్రతి మండలంలోనూ ఒక 108, 104 వాహనాన్ని సిద్ధం చేస్తున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. చంద్రబాబు హయాంలో అంబులెన్స్‌లకు చిన్నపాటి మరమ్మతులు కూడా చేయించింది లేదన్నారు.

చంద్రబాబు హయాంలో సగానికి పైగా అంబులెన్స్‌లు మూలనపడ్డాయన్నారు. ప్రజల ప్రాణాల పట్ల కనీస స్పృహను చంద్రబాబు ప్రదర్శించలేకపోయారన్నారు.

412 కొత్త 108 వాహనాలు, 656 కొత్త 104 వాహనాలను రేపు ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో 25 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 20నిమిషాల్లో, పట్టణ ప్రాంతాంలో 15 నిమిషాల్లోనే అంబులెన్స్‌ వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు మంత్రి వివరించారు.

108 అంబులెన్స్‌లు మూడు రకాలుగా ఉంటాయన్నారు. అడ్వాన్స్ లైఫ్ సపోర్టు అంబులెన్స్‌లు 104, బేసిక్ లైఫ్ సపోర్టు వాహనాలు 282, శిశు మరణాల నివారణ కోసం జిల్లాకు రెండు చొప్పున ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి మండలానికి ఒక 104 వాహనం ఏర్పాటు చేయడంతో పాటు మండలంలోని ప్రతి గ్రామానికి నెలకు ఒకసారైనా ఈ వాహనం వెళ్లేలా చేస్తామన్నారు.

104 వాహనాల్లో గతంలో కొన్ని మందులు మాత్రమే ఉండేవని… ఇప్పుడు రక్త పరీక్షలు నిర్వహించడంతో పాటు 72 రకాల మందులను 104 వాహనాల్లో సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. గ్రామీణప్రాంత ప్రజలకు 104 వాహనాల ద్వారా వైద్యాన్ని చేరువ చేస్తామన్నారు. 104 వాహనంలో ఒక మెడికల్ ఆఫీసర్‌ను ఉంచుతామన్నారు ఆళ్ల నాని.

కరోనా వైద్యం విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడిని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చామని చెప్పారు. కరోనా పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల మద్దతు కూడా ఈ విషయంలో చాలా అవసరమన్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందన్నారు.

First Published:  30 Jun 2020 6:05 AM GMT
Next Story