Telugu Global
National

వలస కార్మికులు మళ్లీ వస్తున్నారు

కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించడంతో జన జీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా వలస కార్మికులు, కూలీలు చేయడానికి పని లేక లక్షల సంఖ్యలో స్వగ్రామాలకు తరలివెళ్లారు. కాలి నడకన, ట్రక్కుల్లో, రైళ్ల పట్టాల వెంబడి నడుస్తూ సొంతూర్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలో పలువురు కార్మికులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, అలా వెళ్లి రెండు నెలలు గడిచిందో లేదో మళ్లీ వలస కార్మికులు […]

వలస కార్మికులు మళ్లీ వస్తున్నారు
X

కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించడంతో జన జీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా వలస కార్మికులు, కూలీలు చేయడానికి పని లేక లక్షల సంఖ్యలో స్వగ్రామాలకు తరలివెళ్లారు. కాలి నడకన, ట్రక్కుల్లో, రైళ్ల పట్టాల వెంబడి నడుస్తూ సొంతూర్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలో పలువురు కార్మికులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.

కాగా, అలా వెళ్లి రెండు నెలలు గడిచిందో లేదో మళ్లీ వలస కార్మికులు తిరుగు పయనం అయ్యారు. ముఖ్యంగా ముంబై నగరానికి కార్మికులు పోటెత్తుతున్నారు. సొంతూర్లలో ఉపాధి కరువవ్వడంతో పాటు ముంబైలో తిరిగి నిర్మాణాలు ప్రారంభం కావడం, కర్మాగారాలు తెరుచుకోవడంతో భారీ సంఖ్యలో కార్మికులు వస్తున్నారు.

ముంబై నగరానికి దాదాపు ఐదున్నర లక్షల మంది కార్మికులు తిరిగి వచ్చినట్లు రైల్వేశాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. కార్మికులతో పాటు వ్యాపారులు కూడా తిరిగి మహానగరంలో అడుగుపెట్టారని సమాచారం. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వాళ్లే అత్యధికంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

కాగా, ముంబైలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా.. కార్మికులు తిరిగి నగరానికి రావడం ఆందోళన కలిగిస్తోంది. నగరానికి వచ్చేవాళ్లు ఎక్కడ ఉంటున్నారో తెలియక అధికారులు తలపట్టుకుంటున్నారు. సాధ్యమైనంతగా తిరిగి వచ్చిన వాళ్లు సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో రిపోర్టు చేయాలని సూచిస్తున్నారు.

First Published:  29 Jun 2020 5:49 AM IST
Next Story