Telugu Global
International

కోవిడ్-19కు ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ చాలా మెరుగైనది

ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకున్న వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతుండటంతో అందరూ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు 140పైగా వ్యాక్సిన్లు అభివృద్ది దశలో ఉండగా వీటిలో 13 వ్యాక్సిన్లు ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. అయితే వీటిలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా సంస్థ సంయుక్తంగా అభివృద్ది చేస్తున్న టీకా, మాడెర్నా సంస్థ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిలు మెరుగైన […]

కోవిడ్-19కు ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ చాలా మెరుగైనది
X

ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకున్న వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతుండటంతో అందరూ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు 140పైగా వ్యాక్సిన్లు అభివృద్ది దశలో ఉండగా వీటిలో 13 వ్యాక్సిన్లు ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. అయితే వీటిలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా సంస్థ సంయుక్తంగా అభివృద్ది చేస్తున్న టీకా, మాడెర్నా సంస్థ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిలు మెరుగైన దశలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తున్న టీకా మాత్రం అన్ని వ్యాక్సిన్ల కంటే చాలా మెరుగైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ చెప్పారు.

ప్రస్తుతం ఆయా పరిశోధకులు నిర్వహిస్తున్న ట్రయల్స్ ప్రకారం ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రా జెనెకా వ్యాక్సిన్ ముందంజలో ఉందని.. మాడెర్నా వ్యాక్సిన్ జులైలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రా జెనకాల వ్యాక్సిన్ ఇప్పటికే మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం అడ్వాన్డ్స్ స్టేజీలో ఉన్న ఈ వ్యాక్సిన్ కోసం అప్పుడే ఆర్డర్లు కూడా వస్తుండటం గమనార్హం. ఈ వ్యాక్సిన్‌కు ఏజెడ్‌డీ1222 అనే సాంకేతిక నామంతో పిలుస్తున్నారు.

ఈ వ్యాక్సిన్ పూర్తిగా అభివృద్ధి చేశాక.. తయారీ, సరఫరా కోసం బ్రెజిల్‌కు చెందిన ఒక ఫార్మా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వచ్చే ఏడాది జనవరి లోపు దాదాపు 3 కోట్ల డోసులు తయారు చేయనున్నారు. ఇందుకు 127 మిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఏడాది పాటు కరోనా నుంచి రక్షణ లభిస్తుంది.

యూఎస్ సంస్థ మాడెర్నా రూపొందిస్తున్న ఎంఆర్ఎన్ఏ-1273 టీకా రెండో దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికల్లా కోటి డోసుల వ్యాక్సిన్ తయారు చేసేందకు ప్రయత్నాలు ప్రారంభించింది. ముందుగా 30 వేల మందితో జులైలో చివరి దశ ట్రయల్స్ జరిపుతామని సంస్థ సీఈవో స్టెఫానీ బాన్సెల్ చెప్పారు. ఇక ఫ్రెంచ్ ఫార్మా కంపెనీ సనోఫి, జీఎస్‌కేతో కలసి కరోనాకు టీకాను అభివృద్ధి చేసింది. సెప్టెంబర్-డిసెంబర్ మధ్యలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కావల్సి ఉంది. ఇప్పటికే విజయవంతమైన జీఎస్‌కేకు చెందిన ఇమ్యూన్ రెస్పాన్స్‌ను ఈ టీకాలో వాడుతున్నామని, ఈ రేసులో తాము ఒక్కరమే ఉన్నామని వివరించింది.

మరోవైపు థాయిలాండ్‌లో కూడా ఏడు వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్నారు. అక్టోబర్‌లో ఒక వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఒక డోస్‌ను కోతులపై ప్రయోగించగా యాంటీ బాడీస్ రూపొందాయని పరిశోధకుడు కియట్ రుక్స్‌రుంగ్‌థమ్ తెలిపారు. మెజార్టీగా యాంటీబాడీలను న్యూట్రలైజ్ చేసే ప్రక్రియ కనిపించిందని తెలిపారు. వైరస్‌ ఒక కణంలోకి చేరి దాన్ని ధ్వంసం చేయకుండా నిరోధించే ప్రక్రియ అభివృద్ధి చెందిందని చెప్పారు. త్వరలోనే సాన్ డియో, వాంకోవర్ నుంచి అభివృద్ధి చేసిన 10 వేల వ్యాక్సిన్ డోసులను తీసుకొని వచ్చి మనుషులపై ప్రయోగిస్తామని చెప్పారు.

First Published:  29 Jun 2020 1:44 AM IST
Next Story