Telugu Global
National

తెలంగాణ హోంమంత్రికి కరోనా...

తెలంగాణలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్‌ రావడంతో అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయన గన్‌మెన్లు, వ్యక్తిగత సిబ్బంది కూడా కరోనా బారినపడ్డారు. వారు వారం రోజులుగా వైద్యం తీసుకుంటున్నారు. రెండుమూడు రోజులుగా అలీ అనారోగ్యానికి గురికావడంతో ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, గణేష్, ముత్తిరెడ్డి యాదగిరి […]

తెలంగాణ హోంమంత్రికి కరోనా...
X

తెలంగాణలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్‌ రావడంతో అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయన గన్‌మెన్లు, వ్యక్తిగత సిబ్బంది కూడా కరోనా బారినపడ్డారు. వారు వారం రోజులుగా వైద్యం తీసుకుంటున్నారు. రెండుమూడు రోజులుగా అలీ అనారోగ్యానికి గురికావడంతో ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది.

ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, గణేష్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలకు కరోనా సోకింది. కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ కూడా కరోనాతో చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు తమ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మరోసారి లాక్‌డౌన్ ఆలోచన చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

అటు కేంద్ర బృందం హైదరాబాద్‌లో పర్యటిస్తోంది. కంటైన్మెంట్ జోన్‌లతో పాటు ఆస్పత్రులను కేంద్ర బృందం పరిశీలించనుంది. అనంతరం రాష్ట్ర ఉన్నతాధికారులతో కేంద్ర బృందం భేటీ అవుతుంది. మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రికి కేంద్ర బృందం వెళ్తుంది.

First Published:  29 Jun 2020 5:02 AM IST
Next Story