Telugu Global
NEWS

నివేదికే పంపలేదు... క్లీన్‌ చిట్‌ ఎలా వస్తుంది?

తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగింది ముమ్మాటికి నిజమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. పోలవరం అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని… ఇంకా నివేదిక రాకముందే కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అక్రమాలు జరగలేదు అంటూ క్లీన్ చిట్ ఇచ్చినట్టు టీడీపీ మీడియా ప్రచారం చేస్తోందని విమర్శించారు. విజిలెన్స్ నివేదిక వస్తే… గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరెవరు ఎంతెంత అవినీతికి పాల్పడ్డారో మొత్తం బయటకు వస్తుందని మంత్రి […]

నివేదికే పంపలేదు... క్లీన్‌ చిట్‌ ఎలా వస్తుంది?
X

తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగింది ముమ్మాటికి నిజమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. పోలవరం అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని… ఇంకా నివేదిక రాకముందే కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అక్రమాలు జరగలేదు అంటూ క్లీన్ చిట్ ఇచ్చినట్టు టీడీపీ మీడియా ప్రచారం చేస్తోందని విమర్శించారు.

విజిలెన్స్ నివేదిక వస్తే… గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరెవరు ఎంతెంత అవినీతికి పాల్పడ్డారో మొత్తం బయటకు వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పర్యటించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.

“పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఎక్స్ పర్ట్ కమిటీని వేశాం… దానిపై విజిలెన్స్ నివేదిక ఇంకా రాలేదు. అందుకే కేంద్రానికి ఇంకా సబ్ మిట్ చేయలేదు. సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు చేసిన ఫిర్యాదుకు కేంద్రం కూడా ఇదే సమాధానం చెప్పింది. దీన్ని తెలుగుదేశం పార్టీ, ఆ వర్గం మీడియా తమకు అనుకూలంగా మలచుకుని ప్రచారం చేసుకుంటుంది. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు” అని మంత్రి వెల్లడించారు.

”మా ప్రభుత్వం వచ్చాక.. రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చి.. పోలవరంలో ఇప్పటికే రూ. 800 కోట్లు ఆదా చేశాం. పైగా తెలుగుదేశం నేతలు పోలవరం కాంట్రాక్టును మా వాళ్ళకు కట్టబెట్టామని మాట్లాడుతున్నారు.. తెలుగుదేశం హయాంలో నామినేషన్ల పద్ధతిలో పనులు కేటాయించి నిధులు దుర్వినియోగం చేస్తే.. మేం రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ప్రభుత్వానికి ఆదా చేయటం అంటే మా వాళ్ళకు కేటాయించడం ఎలా అవుతుంది. ఎవరైనా తమ వాళ్ళకు కాంట్రాక్టులు కేటాయించాలనుకుంటే.. ఒక రూపాయి ఎక్కువ ధరకు పనులు కేటాయిస్తారు. అదే నిజమైతే.. మీరు గతంలో రూ. 800 కోట్లు ఎక్కువకి నవయుగకి పనులు కట్టబెట్టారని అంగీకరిస్తారా?. ఈ విధంగా చంద్రబాబు హయాంలో రూ. 800 కోట్లు దోపిడీ చేసింది నిజం కాదా..? ”అని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టును 20 శాతం పూర్తి చేసి 70 శాతం పూర్తి చేసినట్టు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసుకున్నారని అనిల్ కుమార్ విమర్శించారు. పోలవరం అంటే ఒక డ్యామ్ కాదు.. దానితో పాటు 1.10 లక్షల కుటుంబాలు అని కూడా ముఖ్యమంత్రి జగన్ గారు చెప్పారన్నారు.

తమకు ప్రాజెక్టు ఎంత ముఖ్యమో… లక్షా పది వేల మంది నిరాశ్రయులకు మంచి చేయడం కూడా అంతే ముఖ్యమన్నారు. నిర్వాసితుల కోసం రూ. 33 వేల కోట్లతో పునరావాసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే 17 వేల కుటుంబాలను మార్చబోతున్నామన్నారు.

పోలవరం ప్రాజెక్టులను జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించే దృశ్యం అందరూ చూస్తారని అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.

First Published:  29 Jun 2020 12:24 PM IST
Next Story