మళ్లీ అదే కాన్సెప్ట్ ఎలా ఓకే చేశాడు
విశాల్ నటించిన అభిమన్యుడు సినిమా గుర్తుందా.. అందులో విశాల్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపిస్తాడు. సమంత హీరోయిన్ గా నటించింది. ఆన్ లైన్ మోసాల నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కింది. కంటికి కనిపించని శత్రువుతో విశాల్ పోరాటం చేస్తాడు. ఫైనల్ గా ఆన్ లైన్ మోసాల గుట్టును రట్టు చేస్తాడు. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ ను రిపీట్ చేస్తూ మళ్లీ మరో సినిమా చేశాడు విశాల్. నిన్న రిలీజైన చక్ర సినిమా ట్రయిలర్ చూస్తే మరోసారి అభిమన్యుడు […]
విశాల్ నటించిన అభిమన్యుడు సినిమా గుర్తుందా.. అందులో విశాల్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపిస్తాడు. సమంత హీరోయిన్ గా నటించింది. ఆన్ లైన్ మోసాల నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కింది. కంటికి కనిపించని శత్రువుతో విశాల్ పోరాటం చేస్తాడు. ఫైనల్ గా ఆన్ లైన్ మోసాల గుట్టును రట్టు చేస్తాడు. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ ను రిపీట్ చేస్తూ మళ్లీ మరో సినిమా చేశాడు విశాల్.
నిన్న రిలీజైన చక్ర సినిమా ట్రయిలర్ చూస్తే మరోసారి అభిమన్యుడు సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. చక్ర సినిమాలో కూడా విశాల్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడు. ఇందులో కూడా సైబర్ మోసాల కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ కూడా కంటికి కనిపించని శత్రువుతోనే విశాల్ యుద్ధం చేస్తుంటాడు.
ఇలా షార్ట్ గ్యాప్ లో సేమ్ కాన్సెప్ట్ ను విశాల్ ఎందుకు ఒప్పుకున్నాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే విశాల్ మాత్రం అప్పటి అభిమన్యుడికి, ఇప్పటి చక్రకు చాలా తేడా ఉందంటున్నాడు. సినిమా చూసిన తర్వాత అందరికీ ఈ విషయం అర్థమౌతుందంటున్నాడు.
ఈ సినిమాలో విశాల్ సరసన శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటించింది. ఆమె పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తీసిన ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడట విశాల్.