Telugu Global
National

కరోనా మందులు ఫ్రీగా ఇస్తాం... లాక్‌డౌన్ కొనసాగిస్తాం

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఈ నెలాఖరుతో లాక్‌డౌన్ ముగిసిపోద్దని, కొన్ని సడలింపులతో కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తే కరోనా కేసులు అధికంగా నిర్థారణ అవుతున్న ప్రాంతాల్లో కఠిన లాక్‌డౌన్ విధిస్తామని అన్నారు. ప్రస్తుతం కరోనా చికిత్స ఔషధాలు తగినంత లేవని.. అయితే ప్రభుత్వం వద్ద […]

కరోనా మందులు ఫ్రీగా ఇస్తాం... లాక్‌డౌన్ కొనసాగిస్తాం
X

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఈ నెలాఖరుతో లాక్‌డౌన్ ముగిసిపోద్దని, కొన్ని సడలింపులతో కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తే కరోనా కేసులు అధికంగా నిర్థారణ అవుతున్న ప్రాంతాల్లో కఠిన లాక్‌డౌన్ విధిస్తామని అన్నారు.

ప్రస్తుతం కరోనా చికిత్స ఔషధాలు తగినంత లేవని.. అయితే ప్రభుత్వం వద్ద తగిన స్టాక్ సమకూరిన తర్వాత కరోనా మందులను ఉచితంగా అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి పలుసేవలను అందుబాటులోకి తెస్తున్నందున వచ్చే రెండు మూడు వారాల్లో కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశమున్నదని, అయితే, ఈ మహమ్మారితో పోరాడటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచామని.. సాధ్యమైనంత మేర అందరికీ టెస్టులు చేయడానికి ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక వసతులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశామని తెలిపారు. కరోనా మందులు రెమ్‌డెసివిర్, ఫావిపిరవిన్‌ల వినియోగానికి రాష్ట్రానికి కేంద్రం అనుమతినిచ్చిందని, ఈ డ్రగ్ తగిన మొత్తంలో సమకూరిన తర్వాత ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచుతామని వివరించారు.

కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీ చక్కగా పని చేస్తోందని పరిశోధనల్లో తేలినందు వల్ల మహారాష్ట్రలో సోమవారం నుంచి ప్లాస్మా థెరపీ సెంటర్లను ప్రారంభిస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధిక ప్లాస్మా థెరపీలు చేసే ఫెసిలిటీ ఇక్కడే రూపొందే అవకాశమున్నదని అన్నారు. కాబట్టి ఇప్పటికే కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు ముందుకొచ్చి వారి ప్లాస్మా అందించాల్సిందిగా కోరారు.

ఇక ఈ నెలాఖరున లాక్‌డౌన్ సడలించబోమని.. అవసరమైతే మరింత కఠినంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. ముంబై నగరం, ఆనుకొని ఉన్న సబర్బన్ ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండటం వల్లే కేసులు భారీగా నమోదవుతున్నాయని.. కానీ రాష్ట్రంలో రికవరీ రేటు బాగుందని ఆయన చెప్పారు. కేంద్ర సహాయాన్ని తీసుకుంటూనే రాష్ట్రంలో కోవిడ్ 19కి మంచి వైద్యాన్ని అందించే ఏర్పాట్లు చేశామని ఠాక్రే వెల్లడించారు.

First Published:  28 Jun 2020 3:00 PM IST
Next Story