Telugu Global
National

ఫైబర్‌ గ్రిడ్‌తో ఐటీ శాఖకు సంబంధం లేదు... అంటే స్కాం జరిగిందన్న మాట...

చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. తప్పులను కవర్ చేయబోయి అసలు నిజాలను పరోక్షంగా చెప్పేస్తుండడంతో టీడీపీ నేతలు తలపట్టుకుంటున్నారు. ఇటీవల ఫైబర్ గ్రిడ్‌పై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంపై మాట్లాడిన నారా లోకేష్‌… ఫైబర్ గ్రిడ్‌కు ఐటీ శాఖకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. గతంలో నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ స్కాం జరిగింది. దాంతో ఆ స్కాం […]

ఫైబర్‌ గ్రిడ్‌తో ఐటీ శాఖకు సంబంధం లేదు... అంటే స్కాం జరిగిందన్న మాట...
X

చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. తప్పులను కవర్ చేయబోయి అసలు నిజాలను పరోక్షంగా చెప్పేస్తుండడంతో టీడీపీ నేతలు తలపట్టుకుంటున్నారు.

ఇటీవల ఫైబర్ గ్రిడ్‌పై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంపై మాట్లాడిన నారా లోకేష్‌… ఫైబర్ గ్రిడ్‌కు ఐటీ శాఖకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు.

గతంలో నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ స్కాం జరిగింది. దాంతో ఆ స్కాం తనకు చుట్టుకునే అవకాశం ఉందన్న ఉద్దేశంతో నారా లోకేష్‌… ముందుగానే ఫైబర్ గ్రిడ్‌కు ఐటీ శాఖకు సంబంధం లేదని వాదన మొదలుపెట్టారు.

నారా లోకేష్‌ వాదనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఫైబర్ గ్రిడ్‌తో అప్పటి ఐటీ మంత్రికి సంబంధం లేదని నారా లోకేష్ చెబుతున్నారంటే… ఫైబర్‌ గ్రిడ్‌లో అవినీతి జరిగిందని ఒప్పుకోవడమేనని వ్యాఖ్యానించారు. ఫైబర్‌ గ్రిడ్‌ లో నారా లోకేష్‌కి సంబంధం లేకపోతే మరి ఆయన తండ్రికి ఉందా అని ప్రశ్నించారు. ఈవీఎంల దొంగ హరిప్రసాద్‌ను ఐటీ అడ్వయిజర్‌గా ఎవరు నియమించారో చెప్పాలన్నారు.

అచ్చెన్నాయుడు ఒక సంతకంతోనే అరెస్ట్ అయితే… మంత్రిగా తాను అలాంటివి రోజుకు వంద పెట్టా అన్న నారా లోకేష్ వ్యాఖ్యలను చూసి చంద్రబాబు ఏమనుకున్నారో అని వ్యంగ్యంగా విజయసాయిరెడ్డి స్పందించారు.

సొంత పెళ్లాలకి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే… జగన్ గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్న నారా లోకేష్‌ వ్యాఖ్యలపైనా విజయసాయిరెడ్డి ట్విట్టర్‌తో ఘాటుగా స్పందించారు. ఎందుకయ్యా.. రాజకీయాల్లో లేని మీ ఆవిడను కూడా నీ చేతగాని మాటలతో ఈ గొడవలోకి లాగుతావ్? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

First Published:  28 Jun 2020 3:58 AM IST
Next Story