Telugu Global
National

జీహెచ్ఎంసీ పరిధిలో 15 రోజులు లాక్‌డౌన్..?

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతీ రోజు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతీ రోజు కనీసం 800 పాజిటివ్ కేసులు వస్తుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. కరోనాకు భయపడి ఇప్పటికే బేగంబజార్, లాడ్ బజార్, జనరల్ బజార్ పరిధిలో వ్యాపారులు స్వచ్ఛంధంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా… జీహెచ్ఎంసీ పరిధిలో 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొని వెళ్లారు. అయితే లాక్‌డౌన్‌ […]

జీహెచ్ఎంసీ పరిధిలో 15 రోజులు లాక్‌డౌన్..?
X

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతీ రోజు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతీ రోజు కనీసం 800 పాజిటివ్ కేసులు వస్తుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

కరోనాకు భయపడి ఇప్పటికే బేగంబజార్, లాడ్ బజార్, జనరల్ బజార్ పరిధిలో వ్యాపారులు స్వచ్ఛంధంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా… జీహెచ్ఎంసీ పరిధిలో 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొని వెళ్లారు.

అయితే లాక్‌డౌన్‌ విధించడం పెద్ద నిర్ణయం అవుతుందని… ప్రజలను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. జీహెచ్ఎంసీ అధికారుల సూచనను పరిశీలిస్తున్నామని…. కేబినెట్‌ సమావేశం తర్వాత గ్రేటర్‌లో లాక్‌డౌన్‌ విధింపుపై నిర్ణయం తీసుకుందామని అధికారులకు తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో కేసులు భారీగా నమోదవులున్న విషయం వాస్తవమే కానీ.. రికవరీ రేటు కూడా మన దగ్గర ఎక్కువగానే ఉందని ఆయన చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయని ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా సోకినవారందరికీ సరైన వైద్యం అందిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

జాతీయ సగటు కరోనా మరణాలతో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య తక్కువగా ఉంది. అందరికీ చికిత్స అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా బెడ్లు సిద్దం చేసినట్లు కేసీఆర్ చెప్పారు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ అన్నారు.

First Published:  28 Jun 2020 5:47 AM GMT
Next Story