ఏపీ హైకోర్టుకు కరోనా భయం, ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కరోనా తాకింది. బుధవారం గుండెపోటుతో చనిపోయిన ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ మృతదేహానికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో హైకోర్టు సిబ్బంది ఉలిక్కిపడ్డారు. దాంతో హైకోర్టు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు 300 మందికి కరోనా పరీక్షలు చేశారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులకు కూడా శుక్రవారం పరీక్షలు చేయనున్నారు. పరీక్షల్లో ఇద్దరు హైకోర్టు ఉద్యోగులకు పాజిటివ్ అని తేలింది. దాంతో కోర్టు విధులను రద్దు చేశారు. ఈనెల […]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కరోనా తాకింది. బుధవారం గుండెపోటుతో చనిపోయిన ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ మృతదేహానికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో హైకోర్టు సిబ్బంది ఉలిక్కిపడ్డారు. దాంతో హైకోర్టు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు 300 మందికి కరోనా పరీక్షలు చేశారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులకు కూడా శుక్రవారం పరీక్షలు చేయనున్నారు.
పరీక్షల్లో ఇద్దరు హైకోర్టు ఉద్యోగులకు పాజిటివ్ అని తేలింది. దాంతో కోర్టు విధులను రద్దు చేశారు. ఈనెల 28 వరకు హైకోర్టు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల మృతి చెందిన రాజశేఖర్‌తో సన్నిహితంగా ఉన్న వారంతా స్వీయ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు.
అటు మరో ఎమ్మెల్యే కూడా ఏపీలో కరోనా బారినపడ్డారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యే సుధాకర్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితోనూ భేటీ అయినట్టు చెబుతున్నారు. ఎమ్మెల్యే పలు ప్రాంతాల్లో తిరిగి వచ్చారు. అనంతపురం జిల్లాకు వెళ్లి వచ్చారు.
విజయనగరం జిల్లాలో వైసీపీ కీలక నేత మేనల్లుడికి కూడా కరోనా సోకింది. హైదరాబాద్ వెళ్లివచ్చాక కరోనా సోకినట్టు భావిస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం మొత్తం 10వేల 884 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం 553 కేసులు నమోదు అయ్యాయి.