పదివేల మార్క్ దాటిన కరోనా కేసులు... ఏపీని దాటేసిన తెలంగాణ
ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు పదివేలు దాటాయి. జూన్ 1 నుంచి రెండు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో టెస్ట్‌లు పెంచిన దగ్గర నుంచి ప్రతిరోజూ 500కి తగ్గడం లేదు. బుధవారం రోజు 891 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఇందులో గ్రేటర్ పాజిటివ్ కేసులు 719. కరోనాతో ఐదుగురు మృతిచెందారు. రంగారెడ్డిలో 86, మేడ్చల్ 55 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 4,069 పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3178 నెగటివ్. 891 పాజిటివ్ […]
ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు పదివేలు దాటాయి. జూన్ 1 నుంచి రెండు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో టెస్ట్‌లు పెంచిన దగ్గర నుంచి ప్రతిరోజూ 500కి తగ్గడం లేదు.
బుధవారం రోజు 891 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఇందులో గ్రేటర్ పాజిటివ్ కేసులు 719. కరోనాతో ఐదుగురు మృతిచెందారు. రంగారెడ్డిలో 86, మేడ్చల్ 55 కేసులు నమోదు అయ్యాయి.
గత 24 గంటల్లో 4,069 పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3178 నెగటివ్. 891 పాజిటివ్ గా తేలాయి. దీంతో తెలంగాణ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య పదివేలు దాటింది. 10,444కి చేరింది. బుధవారం ఒక్కరోజే 137 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం ఇప్పటివరకూ 4,361 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 5,858.
తెలంగాణలో పెరుగుతున్న కేసులతో కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుందనే అనుమానాలు మొదలయ్యాయి. ఒకే ఆఫీసులో 20 నుంచి 30 కేసులు నమోదు అవుతున్నాయి. లేకపోతే ఒకే ఇంట్లో వారికి వైరస్ సోకుతుంది. అంటే ఇక్కడ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వైరస్ వ్యాపిస్తోంది. కొందరికి ప్రైమరీ కాంటాక్ట్‌లు కూడా దొరకడం లేదు.
ఇటు ఏపీలో కూడా కరోనా కేసులు పదివేలు దాటాయి. గత 24 గంటల్లో 497 కేసులు బయటపడ్డాయి. గత 15 రోజుల్లో 5 వేల కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసులు సంఖ్య10,331. ఇప్పటి వరకూ 4,779 రికవరీ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసులు 5,423.
కర్నూలు, కృష్ణాలో కరోనా కేసులు వెయ్యి దాటాయి. అయితే ఏపీలో పట్టణాలు దాటి జిల్లాలు, గ్రామాలకు విస్తరించడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే వివిధ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు తిరిగి వచ్చిన వారితోనే కరోనా సోకుతుందనే అనుమానాలు ఉన్నాయి.