Telugu Global
Cinema & Entertainment

ఆర్జీవీ " అమృత అసలు కథ ఇదీ

ఫాదర్స్ డే సందర్భంగా మర్డర్ అనే పేరుతో రామ్ గోపాల్ వర్మ ఓ పోస్టర్ రిలీజ్ చేయడం, అమృతపై తండ్రి మారుతీరావు అతిప్రేమను చూపించే చిత్రం ఇదని చెప్పడం టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది, వర్మ రిలీజ్ చేసిన పోస్టర్ చూడటంతో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అమృత చెప్పడంతో అందరూ షాకయ్యారు. సినిమా విషయం అమృతకి తెలిసే జరిగి ఉంటుంది, మరి ఎందుకిలా రియాక్ట్ అయింది అనుకున్నారంతా. అందరితో […]

ఆర్జీవీ  అమృత అసలు కథ ఇదీ
X

ఫాదర్స్ డే సందర్భంగా మర్డర్ అనే పేరుతో రామ్ గోపాల్ వర్మ ఓ పోస్టర్ రిలీజ్ చేయడం, అమృతపై తండ్రి మారుతీరావు అతిప్రేమను చూపించే చిత్రం ఇదని చెప్పడం టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది, వర్మ రిలీజ్ చేసిన పోస్టర్ చూడటంతో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అమృత చెప్పడంతో అందరూ షాకయ్యారు.

సినిమా విషయం అమృతకి తెలిసే జరిగి ఉంటుంది, మరి ఎందుకిలా రియాక్ట్ అయింది అనుకున్నారంతా. అందరితో పాటు వర్మ కూడా కంగారు పడ్డాడు. దీంతో అమృతకి ఆయన పర్సనల్ గా వివరణ ఇచ్చుకున్నాడట. ముందుగా అనుకున్నట్టే.. అమృత-ప్రణయ్ లవ్ స్టోరీని బేస్ చేసుకునే సినిమా తీస్తానని, అయితే ఫాదర్స్ డే కావడంతో.. కాస్త నాన్న సెంటిమెంట్ టచ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశానని అన్నాడట వర్మ.

వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ-అమృత మధ్య గతంలో జరిగిన చర్చల సారాంశం కూడా ఇదేనంటున్నాయి ఆర్జీవీ ఫ్యాక్టరీ వర్గాలు. తన లవ్ స్టోరీని మాత్రం హైలెట్ చేస్తూ సినిమా తీయాలని, అలా అయితేనే తమ సబ్జెక్ట్ ని టచ్ చేయండనే అమృత కండిషన్ మేరకే వర్మ రంగంలోకి దిగాడట. తీరా పోస్టర్ పై తండ్రి కనపడ్డం, అతిప్రేమ అనడంతో అమృత అవాక్కై వర్మని తిట్టిపోసింది. అయితే ఆర్జీవీ ఇచ్చిన క్లారిఫికేషన్ తో అమృత మామయ్య సాయంత్రానికల్లా ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. అసలు వర్మ సినిమా పోస్టర్ పై అమృత స్పందించలేదని, అది ఫేక్ న్యూస్ అని అన్నారు.

ఫేక్ న్యూస్ అయితే.. ప్రముఖ మీడియా సంస్థలన్నీ ఎందుకు ప్రముఖంగా ప్రచురిస్తాయి? మొత్తమ్మీద సోమవారం సాయంత్రానికి వ్యవహారం సద్దుమణిగింది. రామ్ గోపాల్ వర్మ కేవలం ఫాదర్స్ డే సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోడానికే అమృత-మారుతీరావు ఫొటో అంటూ మర్డర్ పోస్టర్ విడుదల చేశాడు.. అదే వాలంటైన్స్ డే వచ్చుంటే.. అమృత-ప్రణయ్ వీరోచిత ప్రేమగాథ అని పోస్టర్ పడి ఉండేది. ఆటోమేటిగ్గా ఆ లవ్ స్టోరీ పోస్టర్ అమృతకి పిచ్చపిచ్చగా నచ్చి ఉండేది.

మొత్తమ్మీద మర్డర్ అనే ఈ యదార్థ సంఘటనల ఆధారిత సినిమా కథ అనేది మొత్తం ఓ కల్పిత వ్యవహారం అని తేలుతోంది. అది వర్మ తనకు నచ్చినట్టుగా తీస్తాడు, కమర్షియల్ మసాలా దట్టించి మరీ జనంలోకి వదులుతాడు. ఏదేమైనా మర్డర్ సినిమాలో అమృత-ప్రణయ్ లవ్ ట్రాకే కీలకంగా ఉంటుందట. ఇదీ అసలు మేటర్.

First Published:  24 Jun 2020 1:00 AM IST
Next Story