నిమ్మగడ్డతో ఆ ఇద్దరి రహస్య భేటీ?
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ న్యూస్. ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో టీడీపీ మాజీ నేతలు, ప్రస్తుత బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్‌లో ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశం వివరాలను సీసీ పుటేజీతో సహా ఓ టీవీ చానల్ ప్రసారం చేసింది. ఈనెల 13న హైదరాబాద్‌లో ఈ మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు ఏ విషయంపై సమావేశమయ్యారు? ఏం చర్చించారు? […]
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ న్యూస్. ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో టీడీపీ మాజీ నేతలు, ప్రస్తుత బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్‌లో ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశం వివరాలను సీసీ పుటేజీతో సహా ఓ టీవీ చానల్ ప్రసారం చేసింది.
ఈనెల 13న హైదరాబాద్‌లో ఈ మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు ఏ విషయంపై సమావేశమయ్యారు? ఏం చర్చించారు? అనేది ఇప్పుడు చర్చగా మారింది. బీజేపీలో చేరిన సుజనా చౌదరి ఇప్పటికీ కూడా చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు ఈ సమావేశంతో మరోసారి రుజువైంది.
పార్క్‌హయత్ హోటల్ కి మొదట 11గంటల 23 నిమిషాలకు కామినేని శ్రీనివాస్ వచ్చారు. ఆతర్వాత 11గంటల 44 నిమిషాలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. ఆతర్వాత సుజనా చౌదరి వచ్చారు. ముగ్గురు కలిసి పార్క్ హయత్‌లోని ఓ రూమ్‌లోకి వెళ్లారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఇద్దరు రాజకీయ నేతలతో రహస్యంగా ఎందుకు భేటీ అయ్యారు? ఈ సీక్రెట్ మీటింగ్ మర్మమేంటి? అనేది సంచలనంగా మారింది.
మొత్తానికి సీసీ పుటేజీతో నిమ్మగడ్డ వ్యవహారం మరోసారి తేటతెల్లమైంది. ఎవరి ఆదేశాల మేరకు ఆయన పనిచేస్తున్నారనేది నిరూపితమైంది.
మరోవైపు ఈ నెల13న శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ ఇద్దరి నేతల్లో ఎవరో ఒకరు చంద్రబాబుని కలిసి వచ్చిన తర్వాతే నిమ్మగడ్డతో సమావేశమయ్యారు అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట.
దీంతో ఈ ముగ్గురి భేటీ, చంద్రబాబు హైదరాబాద్‌లోనే ఉండడంతో… రాజకీయంగా ఏదో చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్క్‌హయత్‌తో పాటు చంద్రబాబు ఇంటి ముందు ఉన్న సీసీకెమెరాలు కూడా పరిశీలిస్తే పూర్తి విషయాలు తెలుస్తాయని వైసీపీ నేతలు అంటున్నారు.