గంటా అనుచరుడు అరెస్ట్
మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు నలంద కిషోర్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో ఆయన్ను తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. మహిళలను కించపరిచేలా ఒక కథనాన్ని సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేసిన కేసులో నలంద కిషోర్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది. రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు మూడు రోజుల క్రితమే ఈ పోస్టు మూలాన్ని కనుగొన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌కు అత్యంత సన్నిహితుడైన నలంద కిషోర్‌కు మూడు రోజుల క్రితం నోటీసులు […]
మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు నలంద కిషోర్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో ఆయన్ను తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.
మహిళలను కించపరిచేలా ఒక కథనాన్ని సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేసిన కేసులో నలంద కిషోర్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది.
రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు మూడు రోజుల క్రితమే ఈ పోస్టు మూలాన్ని కనుగొన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌కు అత్యంత సన్నిహితుడైన నలంద కిషోర్‌కు మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై లోతుగా దర్యాప్తు చేసిన సీఐడీ ఈ తెల్లవారుజామున నలంద కిషోర్‌ను అరెస్ట్ చేసింది.
ఈయన గంటాకు అత్యంత సన్నిహితుడే కాకుండా గంటా ప్రత్యర్థులపై వ్యతిరేక ప్రచారం చేస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. నలంద కిషోర్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న గంటా శ్రీనివాస్ సీఐడీ కార్యాలయానికి వచ్చారు. వాట్సాప్‌లో వచ్చిన స్టోరీని పార్వార్డ్ చేస్తే దానికే అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
నలంద కిషోర్‌కు 70ఏళ్ల వయసు అని… అలాంటి వ్యక్తిని రాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందన్నారు. స్టోరీలో ఎవరి పేర్లు లేవని అలాంటప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని గంటా ప్రశ్నించారు.