వర్మా... నా జీవితాన్ని బజారులో పెట్టకు " అమృత
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు అందరికీ తెలిసిందే. తన కూతురు అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కక్షతో మారుతీరావు నడిరోడ్డుపై ప్రణయ్‌ను నరికించి చంపించాడు. ఈ పరువు హత్య ఎంతో సంచలనం సృష్టించింది. ఇప్పుడు దీని నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్ – కుటుంబ కథా చిత్రమ్’ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా విడుదల చేశాడు. దీనిపై […]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు అందరికీ తెలిసిందే. తన కూతురు అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కక్షతో మారుతీరావు నడిరోడ్డుపై ప్రణయ్‌ను నరికించి చంపించాడు. ఈ పరువు హత్య ఎంతో సంచలనం సృష్టించింది.
ఇప్పుడు దీని నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్ – కుటుంబ కథా చిత్రమ్’ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా విడుదల చేశాడు. దీనిపై అమృత స్పందించింది.
ఈ పోస్టర్ చూడగానే తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని.. ఇప్పటికే తలకిందులైన తన జీవితంలో ఏడవాలన్నా కన్నీళ్లు రావడం లేదని అన్నారు. ప్రేమించిన వ్యక్తిని, తండ్రిని కోల్పోయి.. ఎన్నో ఛీత్కారాలను ఎదుర్కొని జీవిస్తున్నాను. ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతూ.. ఆత్మగౌరవంతో బతుకుతున్నాను. కానీ రాంగోపాల్ వర్మ రూపంలో మరో సమస్య ఎదురయ్యిందని ఆమె వాపోయారు.
”వర్మా.. దయచేసి నా జీవితాన్ని బజారులో పెట్టొద్దు.. ఉన్నంతలో ప్రశాంతంగా బతుకుతున్నాను. నువ్వు విడుదల చేసిన పోస్టర్‌కు, నా జీవితానికి ఎక్కడా పోలికలు లేవు. ఇదంతా నువ్వు మా పేర్లను వాడుకొని అమ్ముకోవాలనుకుంటున్న తప్పుడు కథ. నీపై ఎలాంటి కేసులు వేయను. ఎన్నో బాధలు అనుభవించా.. నీదో పెద్ద బాధ కాదు. రెస్ట్ ఇన్ పీస్” అంటూ ఒక ప్రకటన చేసింది.